KTR: అమెరికాలో కేటీఆర్.. రూ. 150 కోట్ల పెట్టుబడులతో తిరిగి తెలంగాణకు..

KTR: అమెరికాలో కేటీఆర్.. రూ. 150 కోట్ల పెట్టుబడులతో తిరిగి తెలంగాణకు..
KTR: అమెరికాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది.

KTR: అమెరికాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఆయనకు ఎన్నారైలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడున్న వ్యాపార అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్‌ పర్యటించడంపై హర్షం వ్యక్తం చేశారు ఎన్నారైలు. మరోవైపు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ కెమ్ వేద ముందుకు వచ్చింది. తెలంగాణలో విస్తరించేందుకు రూ.150 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు సంస్థ తెలిపింది.

ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, ఆగ్రో కెమికల్, పరిశ్రమలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది. 45 మంది ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం 450 మందికి చేరింది. కంపెనీని భారీగా విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, నాణ్యమైన మానవ వనరులు ప్రధాన కారణాలని తెలిపింది.కంపెనీ వేగంగా విస్తరిస్తోందన్నారు కంపెనీ అధ్యక్షులు, సీఈఓ బీమా రావు పారసెల్లి.

రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ సుమారు రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల 500 మంది హై స్కిల్ల్డ్ నిపుణులకు అవకాశాలు లభిస్తాయన్నారు. తెలంగాణలో విస్తరణకు నిర్ణయించిన కెమ్ వేద లైఫ్ సైన్సెస్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. హైదరాబాద్ ఫార్మా లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ ఈకో సిస్టంను ఈ డెవలప్మెంట్ సెంటర్ మరింత బలోపేతం చేస్తుందన్నారు మంత్రి కేటీఆర్‌. మరోవైపు... హైదరాబాద్ ఫార్మా యూనివర్సిటీలో భాగం కావాలని ప్రఖ్యాత పరిశోధన సంస్థ స్క్రిప్స్‌ను కోరారు మంత్రి కేటీఆర్‌. రీసెర్చ్, జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల రూపకల్పనలో భాగస్వామ్యాన్ని అందించాలన్నారు. మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్ పై స్క్రిప్స్ బృందం ఆసక్తి కనబర్చింది.

సైన్స్ పరిశోధనల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన సంస్థగా స్క్రిప్స్ రీసెర్చ్ కు పేరుంది. 2,400 మంది శాస్త్రవేత్తలు, సిబ్బందితో పాటు 200 కంటే ఎక్కువ ప్రయోగశాలలు ఈ సంస్థకు ఉన్నాయి. అతిపెద్ద ప్రైవేట్, లాభాపేక్షలేని బయోమెడికల్ పరిశోధన సంస్థ ఇది. ఈ సంస్థకు చెందిన ఐదుగురికి నోబెల్ బహుమతులు వచ్చాయి.దాదాపు 1,100 పేటెంట్లు ఉన్నాయి

Tags

Read MoreRead Less
Next Story