పింగళి కుమార్తెకు మహాత్మాగాంధీ వంశీ-శుభోదయం అవార్డు..!

వంశీ ఇంటర్నేషనల్`ఇండియా, శుభోదయం గ్రూప్-ఇండియా, సంయుక్త ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి అంతర్జాలంలో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా మన జాతీయజెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి 'మహాత్మాగాంధీ వంశీ-శుభోదయం అవార్డు-2021'ని మాచర్లలోని వారి స్వగృహంలో ఆమె కుమారులు జి.వి.ఎన్. నరసింహం ఆధ్వర్యంలో కన్నులపండుగగా నిర్వహించబడిరది. వంశీ వ్యవస్థాపకులు శిరోమణి డా॥ వంశీ రామరాజు, లయన్ డా॥ లక్ష్మీప్రసాద్, చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శుభోదయం గ్రూప్ నిర్వహణలో శోభాయమానంగా జరిగిన ఈ కార్యక్రమంలో 5 ఖండాల నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొని జాతిపితకు ఘననివాళి అర్పించారు.
ప్రముఖనటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు డా॥ జమున రమణారావు మాట్లాడుతూ తన చిన్నతనంలో గాంధీ మహాత్ముని చూశానని, అప్పటి విశేషాలు పంచుకున్నారు. గాంధీక్షేత్రం అవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ 'నేటి యువతకు మహాత్ముని ప్రబోధాలు తెలియచెప్పవలసిన అవసరం ఉంద'న్నారు. ప్రొఫెసర్ ప్రసాద్ గొల్లనపల్లి (మేనేజింగ్ ట్రస్టీ గాంధీ కింగ్ ఫౌండేషన్), డా॥ సుద్దాల అశోక్‌తేజ, మాధవపెద్ది సురేష్, రేలంగి నరసింహారావు, భువనచంద్ర, ఉపేంద్ర చివుకుల (కమిషనర్, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ యుటిలిటి & ఫార్మర్ న్యూజెర్సీ అసెంబ్లీమాన్, అమెరికా), డా॥ చిట్టెన్‌రాజు వంగూరి (అధ్యక్షులు, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా), డా॥ ప్రసాద్ తోటకూర (ఫౌండర్ చైర్మన్, మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ అమెరికా), డా॥ శ్రీరామ్ శొంఠి (వైస్ ప్రెసిడెంట్, గాంధీ మెమోరియల్ చికాగో), శ్రీనివాస్ గూడూరు (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, తెలంగాణా తెలుగు అసోసియేషన్, వెంకట్ ఎక్కా (నేషనల్ కో-ఆర్డినేటర్, తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్), శ్రీదేవి జాగర్లమూడి (తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, న్యూజెర్సీ), డా॥ హరి ఇప్పనపల్లి (చైర్మన్, లీడ్ ఇండియా ఫౌండేషన్), గుణసుందరి కొమ్మారెడ్డి (అమెరికా), లలితారామ్ (అమెరికా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), జయ పీసపాటి (హాంగ్‌కాంగ్), డా॥ జొన్నలగెడ్డ మూర్తి (యు.కె.), సత్యాదేవి మల్లుల (మలేషియా), అనిల్‌కుమార్ కడించెర్ల (ఒమాన్), వెంకట సురేష్ (యుఎఇ), తాతాజీ ఉసిరికల (ఖతార్), వెంకటేశ్వరరావు తోటకూర (బోట్స్‌వానా), రాజేశ్ ఎక్కలి (అమెరికా), జి. కృష్ణకిరణ్ (సౌత్ ఆఫ్రికా), జి. ప్రియాంక (న్యూజిలాండ్), టి. శైలూష (రియాద్), జి. కృష్ణ ప్రవీణ్, ఎమ్. ఛాయాదేవి, జి. వెంకటేశ్వరి, ఆర్. శైలజ, జి. గోపీకృష్ణ, ఎస్. ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.
వి.ఆర్.ఆర్. పద్మజ (ఖతార్), బొమ్మన గౌరీదేవి (ఖతార్), డా॥ తెన్నేటి సుధ, శైలజ సుంకరపల్లి పాల్గొన్న ఈ కార్యక్రమానికి రాధిక మంగిపూడి (సింగపూర్) వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రామాంతపూర్ పబ్లిక్ స్కూలుకు చెందిన 6వ తరగతి విద్యార్థిని అనఘదత్త రామరాజు ప్రార్థనాగీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా Trinet live టి.వి., శుభోదయం మీడియా ద్వారా ప్రేక్షకులు ఈ కార్యక్రమం వీక్షించారు. మీడియా పార్ట్‌నర్స్‌గా టి.వి. ఆసియా, సాక్షి, యుఎస్‌ఐ (టెలివిజన్), టి.వి.5 న్యూస్, మన టి.వి., మా గల్ఫ్ వ్యవహరించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com