Pakistan: ప్రెగ్నెంట్ అని చూడకుండా కాలితో తన్నిన సెక్యూరిటీ గార్డ్..

Pakistan: ప్రెగ్నెంట్ అని చూడకుండా కాలితో తన్నిన సెక్యూరిటీ గార్డ్..
Pakistan: ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఓ మహిళపై విచక్షణా రహితంగా దాడి చేశాడు ఓ సెక్యూరిటీ గార్డ్.

Pakistan: ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఓ మహిళపై విచక్షణా రహితంగా దాడి చేశాడు ఓ సెక్యూరిటీ గార్డ్. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు వైరల్ అవ్వడంతో పోలీసులు అతడిని అదుపులో తీసుకున్నారు. ఈ వైరల్ వీడియో చూసి దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది.

పాకిస్థాన్‌‌లోని కరాచిలో నోర్మాన్ గ్రాండ్ సిటీ అపార్ట్‌మెంట్స్‌లో సనా పనిమనిషిగా పనిచేస్తోంది. తను చెప్పినదాని ప్రకారం.. ఆగస్ట్ 5న తెల్లవారుజామున 3 గంటలకు తన కొడుకును భోజనం తీసుకొని రమ్మని చెప్పింది. అయితే అతడిని అపార్ట్‌మెంట్ లోపలికి రానివ్వకుండా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు అబ్దుల్ నాజిర్, ఆదిల్ ఖాన్, మహమ్మద్ ఖలీల్ అడ్డుకున్నారు. ఏమైందో కనుక్కోవడానికి సనా అక్కడికి వచ్చింది.

అప్పుడు విచక్షణ కోల్పోయిన ఆదిల్.. సనాను దూషించాడు. మరో సెక్యూరిటీ గార్డ్ తనను చెంపపై కొట్టగా తను కింద పడిపోయింది. కింద పడిన తర్వాత కాలుతో సనాను తన్నాడు. దీంతో నొప్పి భరించలేక సనా స్పృహ కోల్పోయింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదో ఒక విధంగా బయటికి వచ్చి.. వైరల్ అవ్వడంతో ఆ సెక్యూరిటీ గార్డులపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. అయితే అప్పటికే సనా 7 నెలల ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story