Sri Lanka: శ్రీలంకలో సంక్షోభం.. సెక్స్ వర్కర్లుగా మారుతున్న మహిళలు..

Sri Lanka: శ్రీలంకలో సంక్షోభం.. సెక్స్ వర్కర్లుగా మారుతున్న మహిళలు..
Sri Lanka: చేతిలో చిల్లి గవ్వ లేదు.. శ్రీలంకలో ఎటు చూసినా దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి..

Sri Lanka: చేతిలో చిల్లి గవ్వ లేదు.. శ్రీలంకలో ఎటు చూసినా దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ఇలాంటి నిస్సహాయ స్థితిలో లంక మహిళలు పొట్టకూటి కోసం సెక్స్‌ వర్కర్లుగా మారుతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి.. పిల్లల కడుపు నింపేందుకు నిత్యావసరాలు, మందులకు డబ్బుల్లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో మహిళలు తమ దేహాలను తాకట్టు పెడుతున్నారు. ముఖ్యంగా టెక్స్‌టైల్ పరిశ్రమల్లో ప‌నిచేసే మ‌హిళ‌లు త‌మ ఉద్యోగాలు కోల్పోవ‌డంతో వేరే దారిలేక సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు.

ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో టెక్స్ టైల్స్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. ఎగుమతులు 10 నుంచి 20 శాతం వరకు కోల్పోవాల్సి వచ్చింది.. దీంతో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి.. మరికొన్ని వేతనాలను తగ్గించడం, ఉద్యోగులను తొలగించడం వంటివి చేస్తున్నాయి.. దీంతో పెద్ద ఎత్తున మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు.. టెక్స్‌టైల్‌ కంపెనీల్లో గ‌తంలో నెల‌కు 28 వేల రూపాయ‌లు ఇచ్చేవారు.. ఓవ‌ర్‌టైమ్‌ ప‌నిచేస్తే 35 వేల వ‌ర‌కూ వచ్చేవి.. ఆర్ధిక సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోవడంతో వీధిన‌ప‌డ్డామ‌ని మహిళలంటున్నారు..

ప్రత్యామ్నాయ పనులు లేకపోవడంతో ఇల్లు గడవాలంటే శరీరాన్ని అమ్ముకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని వారంటున్నారు.. నిత్యావసరాల కోసం అక్కడి దుకాణదారులతో శృంగారంలో పాల్గొనాల్సి వస్తోందని చెప్తున్నారు.. వ్యభిచార వృత్తిలో తాము ఇప్పుడు రోజుకు 15 సంపాదిస్తున్నామని మహిళలు అంటున్నారు. ఈ మాటలు అక్కడి దుర్భర పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి.

ఈ ఏడాది జనవరి నుంచి శ్రీలంక రాజధాని కొలంబోలో సెక్స్ వర్కర్లుగా మారిన మహిళల సంఖ్య ఏకంగా 30 శాతం పెరగడం అక్కడి సంక్షోభ తీవ్రతను గుర్తు చేస్తోంది.. వీరిలో ఎక్కువ మంది మహిళలు గతంలో వస్త్ర పరిశ్రమలో ఉపాధి పొందిన వారేనని రిపోర్ట్‌లు వెల్లడిస్తున్నాయి.. లంక న‌గ‌రాల్లో తాత్కాలిక శిబిరాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అలాగే కొలంబో బండారు నాయకే విమానాశ్రయ ప్రాంతంలో లైంగిక వ్యాపారం మరింతగా పెరుగుతోంది. ఈ వేశ్యా గృహాలకు పోలీసుల సహకారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే, పోలీసులతో కూడా ఒళ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story