Taiwan Earthquake : తైవాన్‌లో భారీ భూకంపం.. కుప్ప కూలిన భవనాలు..

Taiwan Earthquake : తైవాన్‌లో భారీ భూకంపం.. కుప్ప కూలిన భవనాలు..
X
Taiwan Earthquake : తైవాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.2గా నమోదైంది

Taiwan Earthquake : తైవాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.2గా నమోదైంది. తైవాన్ నగరం తైతుంగ్‌కు ఉత్తరాన 30 మైళ్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్టు యూఎస్‌జీఎస్ అంచనా వేసింది. తొలుత భూకంప తీవ్రతను 7.2గా పేర్కొన్నప్పటికీ ఆ తర్వాత దాని తీవ్రతను తగ్గించి 6.9గా తెలిపింది. భూకంపాంతో పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. అపార్టమెంట్లు కుప్పకూలిపోయాయి. చిన్న పట్టణాల్లో కనీసం ఏదో ఒక భవనం కూలిపోయినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

ఒక్కసారిగా భారీ భూ ప్రకంపనలు రావడంతో... జనం ఇళ్లు, కార్యాలయ నుంచి బయటికి పరుగులు తీశారు. ఇప్పటికివరకు 12సార్లు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. రాజధాని తైపీలో భవనాలు కంపించాయి. యూలీ నగరం భీతిల్లింది. ఇక్కడ ఓ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. భూకంప ప్రకంపనలు రాజధాని నగరం తైపేయిలోనూ కనిపించాయి. అయితే ఎలాంటి ప్రాణ హాని, ఆస్తి న‌ష్టం సంభ‌వించ‌లేద‌ంటున్నాయి అధికార వర్గాలు.

ఈ భూకంప తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జపాన్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఒక మీటర్ ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. తైవాన్‌కు తూర్పున 110 కిలోమీటర్లు దూరంలోని జపాన్‌లోని పశ్చిమ ద్వీపమైన యోనాగుని ద్వీపానికి తొలి అలలు చేరుకోవచ్చని ఏజెన్సీ తెలిపింది. ఆ తర్వాత సమీపంలోని మూడు ద్వీపాల్లో అలలు ఎగసిపడే అవకాశముందని తెలిపింది. ముప్పు ఉండటం వల్ల ప్రజల్ని ముందుగానే అప్రమత్తం చేశారు అధికారులు. మరోవైపు చైనా తీర ప్రాంతాల్లోనూ భూకంప ప్రకంపనలు వచ్చాయి. తీర ప్రాంతాలు ఫఉజియన్, గువాంగ్‌డాంగ్, జియాంగ్సు, షాంఘై సహా పలు చోట్ల ఈ ప్రకంపనలు వచ్చినట్టు చైనా ఎర్త్‌క్వేక్ నెట్‌వర్క్ సెంటర్ తెలిపింది.


Tags

Next Story