Mexico Earthquake : మెక్సికోలో భారీ భూకంపం.. 20 సెకన్ల పాటు కంపించిన భూమి..

Mexico Earthquake : మెక్సికోలో భారీ భూకంపం.. 20 సెకన్ల పాటు కంపించిన భూమి..
Mexico Earthquake : దక్షిణ అమెరికా దేశం మెక్సికో భారీ భూకంపంతో వణికిపోయింది

Mexico Earthquake : దక్షిణ అమెరికా దేశం మెక్సికో భారీ భూకంపంతో వణికిపోయింది. అక్కడి లోకల్‌ టైమ్‌ జోన్‌ ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటలకు భారీ భూ ప్రకంపనలు నమోదయ్యాయి.. దాదాపు 20 సెకెన్లపాటు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.. రిక్టర్‌ స్కేలుపై 7.6గా తీవ్రత నమోదైంది.. భూకంపం ధాటికి భవనాలు పేక మేడల్లా ఊగిపోయాయి.. భూ ప్రకంపనలతో మెక్సికో నగరంలో జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

అక్విలాకు ఆగ్నేయంగా 37 కిలోమీటర్ల దూరంలో కోలిమా-మిచోకాన్ రాష్ట్రాల సరిహద్దుకు సమీపంలో 15.1 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భారీ ప్రకంపనల ధాటికి భవనాలు, చెట్లు ఊగిపోయాయి. జనం భయంతో బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రులు, ప్రయాణాల్లో ఉన్నవాళ్లు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు. మాంజాని, కోల్‌కోమన్ పట్టణాల్లో భారీ నష్టం జరిగినట్లు మెక్సికన్‌ పబ్లిక్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఓ వ్యక్తి మరణించినట్లుగా సమాచారం.. చాలా భవనాలకు పగుళ్లు రాగా, కొన్ని భవనాలు నేలకూలినట్లుగా అక్కడి అధికారులు చెప్పారు.

మరోవైపు, సముద్ర అలలు తొమ్మిది అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం సముద్ర మట్టాలు సాధారణంగానే ఉన్నాయని సునామీ వచ్చే అవకాశాలు లేవని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్‌బామ్ ట్వీట్‌ చేశారు. ప్రాణనష్టం తక్కువగానే ఉన్నా.. ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అటు సెప్టెంబర్‌ 19వ తేదీ మెక్సికోకు శాపంగా మారింది. ఇదే తేదీన మెక్సికో చరిత్రలో ఎన్నో పెను విషాదాలు సంభవించాయి. 1985 సెప్టెంబర్‌ 19వ తేదీన రిక్టర్‌స్కేల్‌పై 8 తీవ్రతతో భూకంపం, పది అడుగుల ఎత్తు అలలతో సునామీ సంభవించగా ఐదువేల మందికిపైగా మరణించారు. 2017 సెప్టెంబర్‌ 19వ తేదీన మెక్సికో మున్సిపాలిటీ పరిధిలోని ప్యూబ్లాలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ దాటికి సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆరు వేల మందికిపైగా గాయపడ్డారు. మళ్లీ అదే తేదీన భారీ భూకంపం సంభవించింది. 1985, 2017లో ఇదే తేదీన సంభవించిన భారీ భూకంపాలకు సంబంధించి వార్నింగ్‌ బెల్‌ మోగించిన గంటలోపే మెక్సికోలో కొత్త భూకంపం సంభవించింది.

Tags

Read MoreRead Less
Next Story