Kabul Suicide Bomber : విద్యార్ధులు పరీక్ష రాస్తుండగా.. దూసుకెళ్లిన సూసైడ్ బాంబర్.. 100 మంది చిన్నారులు మృతి..

Kabul Suicide Bomber : విద్యార్ధులు పరీక్ష రాస్తుండగా.. దూసుకెళ్లిన సూసైడ్ బాంబర్.. 100 మంది  చిన్నారులు మృతి..
Kabul Suicide Bomber : అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబుపేళుల్లతో దద్దరిల్లింది

Kabul Suicide Bomber : అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబుపేళుల్లతో దద్దరిల్లింది. గతంలో ఎన్నడు లేనివిధంగా ముష్కరులు ఓ విద్యాకేంద్రంపై విరుచుకుపడ్డారు. దీంతో వందమంది అమాయక విద్యార్దులు మృత్యువాత పడ్డారు. ఆత్మాహుతి దాడి తర్వాత ఆప్రాంతం శ్మశానాన్ని తలిపించింది.

దస్త్ ఇ బార్చి ప్రాంతంలోని కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్ పై ఆత్మాహుతి ఈ దాడి జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. యూనివర్సిటీ మాక్ ఎగ్జామ్ నేపథ్యంలో తరగతి గది విద్యార్ధులతో నిండిపోయింది. రూమ్‌లోకి దూసుకెళ్లిన సూసైడ్ బాంబర్.. ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో అప్పటి వరకు ఆనందంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ గడపుతున్న చిన్నారులు శవాలు ... మాంసం ముద్దగా మారాయి. వారి డెడ్ బాడీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

Tags

Read MoreRead Less
Next Story