Ukraine: ఉక్రెయిన్‌లో తెరుచుకున్న థియేటర్.. తొలిరోజే హౌస్‌ఫుల్..

X
Ukraine: రష్యా కొనసాగిస్తున్న భీకరయుద్ధంతో ఉక్రెయిన్ వణికిపోతోంది. మూడు నెలలుగా విరుచుకుపడుతున్న పుతిన్ సేనల దాడులతో రాజధాని కీవ్ సహా అనేక నగరాల్లోని భవనాలు కుప్పకూలుతున్నాయి. రష్యా దాడులకు వేలాది మంది ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.
అయితే ఉక్రెయిన్ సేనల ప్రతిదాడులతో రష్యా సైన్యం వెనక్కి వెళ్లిపోయాయి. దాంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అనేక నగరాల్లో రోజువారీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. కీవ్‌లో మూడు నెలల తర్వాత ఓ సినిమా థియేటర్ రీఓపెన్ అయింది. అయితే తొలిరోజే మూడు షోలకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోవడంతో పాటు థియేటర్ హౌస్‌ఫుల్‌గా నడుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
