అంతు చిక్కని వ్యాధి.. ఆ దేశంలో 100 మంది మృతి

అంతు చిక్కని వ్యాధితో ఆ దేశం అల్లాడి పోతోంది.. ఇప్పటికే 100 మంది మృతి చెందారని స్వీడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మిస్టరీ వ్యాధి కలవరపెట్టిన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ టాస్క్ ఫోర్స్ బృందాన్ని దక్షిణ సూడాన్‌కు పంపించింది. ఈ వ్యాధితో జోంగ్లీ రాష్ట్రంలోని ఫంగాక్‌లో దాదాపు 100 మంది మరణించారు. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం, వ్యాధిగ్రస్తుల ప్రాథమిక నమూనాలు కలరాకు సంబంధించిన లక్షణాలుగా బయటపడ్డాయని తెలిపారు.
ఈ ప్రాంతంలో తీవ్ర వరదలు ఉండటమే ఇందుకు కారణం. వారిని రాజధాని జుబాకు తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని WHO అధికారి షీలా బయా తెలిపారు. దాదాపు 60 ఏళ్లుగా దేశంలో సంభవించిన అతి పెద్ద వరదల కారణంగా 700,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని UNHCR ఇంతకు ముందు పేర్కొంది. వరదలు రాకపోకలను నిలిపివేసింది .ఆహారం, ఇతర నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో ఇక్కడి జనాభాలో పోషకాహార లోపం స్పష్టంగా కనబడుతోంది.
సరిహద్దు రాష్ట్రమైన యూనిటీ కూడా వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైందని రాష్ట్ర భూ, గృహ, ప్రజా వినియోగ శాఖ మంత్రి లామ్ తుంగ్వార్ కుయిగ్వాంగ్ తెలిపారు. దీంతో మలేరియా వంటి వ్యాధుల వ్యాప్తి పెరిగిందని ఆయన అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com