China Taiwan War : ఇక మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా..?

China Taiwan War : అమెరికా హౌస్ ఆఫ్ రిప్రసెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసి ఆసియా పర్యటన చైనా, అగ్రరాజ్యం మధ్య అగ్గి రాజేసింది. చైనా హెచ్చరించినా...తైవాన్ రాజధాని తైపీలో అడుగుపెట్టారు పెలోసి. తైవాన్‌కు వస్తే తగిన మూల్యం చెల్చించుకోక తప్పదంటూ డ్రాగన్ కంట్రీ హెచ్చరించినా..పెలోసి వెనక్కి తగ్గలేదు. పెలోసి పర్యటన నేపథ్యంలో తైవాన్ సంధిలో చైనా సైనిక విన్యాసాలు చేస్తోంది. అమెరికా సైతం తమ ఆసియా-పసిఫిక్ కమాండ్‌ను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో పెలోసి...తైవన్ పర్యటన తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
పెలోసి పర్యటన నేపథ్యంలో చైనా తన యుద్ధ విమానాలను తైవాన్ భూభాగం వైపు పంపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. చైనా సార్వభౌమ భద్రతా ప్రయోజనాలకు భంగం కలిగేలా పెలోసి వ్యవహరిస్తే అందుకు అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుందని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. చైనా హెచ్చరికల నేపథ్యంలో వైట్ హౌస్ సైతం పెలోసీని హెచ్చరించింది.
తైవాన్‌కు పెలోసి వెళ్తే చైనా సైన్యం కవ్వింపు చర్యలకు దిగే ఛాసన్ ఉందని తెలిపింది. అయినా పెలోసి వెనక్కి తగ్గకపోవడంతో అమెరికా అప్రమత్తమైంది. తైవాన్ ద్వీపానికి తూర్పు వైపు తీరంలో అమెరికాకు చెందిన నాలుగు యుద్ధ నౌకలను మోహరించినట్లు రాయిటర్స్ వెల్లడించింది. అమెరికా నేవీకి చెందిన USS రోనాల్డ్ రీగన్ ఫిలిప్పిన్స్ సముద్రంలోకి ప్రవేశించినట్లు స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com