Narendra Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోడీ.. ఆలింగనంతో స్వాగతం పలికిన అబుధాబి రాజు..
Narendra Modi: ఒక రోజు పర్యటన నిమిత్తం నేడు యూఏఈ రాజధాని అబుధాబి విచ్చేసారు భారత ప్రధాని మోడీ. మోడీ కు ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికి సాదరంగా ఆలింగనం చేసుకున్నారు అబుధాబి రాజు షేక్ మొహమ్మద్. మోడీ కు భారత రాయబారి సంజయ్ సుధీర్ మరియు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. దివగంత యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా మృతిపట్ల నూతన యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ కు సంతాపం తెలియజేయనున్న మోడీ.
నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు సైతం తెలియజేయనున్న మోడీ. షేక్ మొహమ్మద్ తో రాజకుటుంబానికి చెందిన ఇతర సీనియర్ సభ్యులు మోడీతో ఇరు దేశాల దౌత్య సంబంధాలను చర్చించుటకు హాజయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇరు దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై సంతకం చేసిన తదుపరి ఇదే మోడీ తొలి పర్యటన.
షేక్ మొహమ్మద్ మరియు మోడీ ప్రత్యక్షంగా జరిగిన వర్చువల్ సమ్మిట్ సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం ఐదు సంవత్సరాలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $115 బిలియన్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా, యూఏఈ యొక్క అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా భారతదేశం తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com