Narendra Modi: జర్మనీ-యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ బిజీబిజీ..

Narendra Modi: భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. రెండ్రోజుల జర్మనీ-యూఏఈ పర్యటనలో భాగంగా జర్మనీలో ల్యాండ్ అయిన ప్రధాని మోదీకి జర్మన్ ఛాన్సలర్, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రవాస భారతీయులను కలుసుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో ఎన్‌ఆర్ఐలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ప్రజాస్వామ్యం అనేది భారతీయుల రక్తంలోనే ఉందని మోదీ అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కొందరు ఖూనీ చేయాలని ప్రయత్నిస్తే అదే ప్రజాస్వామ్య పద్దతిలో గుణపాఠం చెప్పామని తెలిపారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీని చీకటి రోజుగా అభివర్ణించారు. కొత్త పారిశ్రామిక విప్లవానికి భారత్ నాయకత్వం వహిస్తోందన్న ప్రధాని మోదీ.. ఎన్ఆర్ఐలు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాగా.. రేపు జర్మనీలో జరిగే జీ-7 సదస్సుకు మోదీ హాజరుకానున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com