Narendra Modi: క్వాడ్ దేశాల సదస్సులో మోదీ.. పలువురు దేశాధినేతలతో చర్చలు..
Narendra Modi: క్వాడ్ కూటమి తక్కువ సమయంలోనే ప్రపంచం ముందు తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుందన్నారు ప్రధాని మోదీ.

Narendra Modi: క్వాడ్ కూటమి తక్కువ సమయంలోనే ప్రపంచం ముందు తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుందన్నారు ప్రధాని మోదీ. క్వాడ్ పరిధి మరింత విస్తృతమైందన్నారు. క్వాడ్ దేశాల మధ్య పరస్పర విశ్వాసం ప్రజాస్వామ్య శక్తులకు మరింత ఊతమిస్తుందన్నారు. క్వాడ్ దేశాల సదస్సులో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అధినేతలతో కలిసి మోదీ పాల్గొన్నారు. కరోనా విపత్తు సమయంలో వ్యాక్సిన్ డెలివరీ, వాతావరణ మార్పులు, సప్లై చైన్, విపత్తు నిర్వహణ, ఆర్థిక సహకారం వంటి రంగాల్లో సమన్వయం చేసుకున్నామని గుర్తు చేశారు మోదీ.
ఇది ఇండో-పసిఫిక్ రీజియన్‌లో స్థిరత్వాన్ని, శాంతిని పెంపొందిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆంటోనియో ఆల్బనిస్‌కు శుభాకాంక్షలు చెప్పారు మోదీ. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ ప్రైమ్ మినిస్టర్ కిసిండా, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌లతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇండియా-అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామం మరింత ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ.
టోక్యోలో జరుగుతున్న క్వాడ్ సమిట్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇండియా-అమెరికా మధ్య కుదిరిన ఇన్వెస్ట్‌మెంట్ ఇన్సెంటివ్ అగ్రిమెంట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. క్వాడ్ కూటమికి ఇండియా నుంచి మంచి సహకారం అందుతోందన్నారు బైడెన్. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంపైనా తమ మధ్య చర్చ జరిగిందన్నారు బైడెన్.
RELATED STORIES
Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఐటీ నోటీసులు.. ప్రేమలేఖతో...
1 July 2022 11:45 AM GMTNupur Sharma: నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. వారికి క్షమాపణలు...
1 July 2022 11:00 AM GMTMaharashtra: శివసేనకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్...
1 July 2022 9:00 AM GMTMaharashtra: సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా..
29 Jun 2022 4:22 PM GMTMaharashtra: ముగిసిన మహారాష్ట్ర కేబినెట్ భేటీ.. ఉద్దవ్ థాక్రే సంచలన...
29 Jun 2022 2:30 PM GMTMumbai: సముద్రంలో కూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి..
28 Jun 2022 4:00 PM GMT