Narendra Modi: నేపాల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. బుద్ద పౌర్ణమి సందర్బంగా..

Narendra Modi: నేపాల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. బుద్ద పౌర్ణమి సందర్బంగా..
Narendra Modi: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేపాల్‌లో పర్యటించారు.

Narendra Modi: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేపాల్‌లో పర్యటించారు. బుద్దపౌర్ణమి సందర్బంగా నేపాల్‌లోని చారిత్రక మాయాదేవి ఆలయంలో భారత ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా దంపతులు కూడా ఉన్నారు. అనంతరం ఆలయం పక్కనే ఉన్న అశోక్ స్తంభం వద్ద ఇరుదేశాల ప్రధానులు దీపాలు వెలగించారు. ఆ తర్వాత బోధి వృక్షానికి నీళ్లుపోశారు. బౌద్ద సంస్కృతి, వారసత్వ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

బుద్దపౌర్ణమి సందర్బంగా నేపాల్‌లో పర్యటించిన ప్రధాని మోదీకి ఖాట్మండులో ఘన స్వాగతం లభించింది. గౌతమ బుద్దుని జన్మస్థలమైన లుంబినిలోని ప్రఖ్యాత మాయాదేవి ఆలయంలో పూజలు చేసిన తర్వాత మోదీ నేపాల్ పర్యటన ప్రారంభమైంది. బుద్ద పౌర్ణమి పర్వదినాన నేపాల్ ప్రజలతో ఉండటం తనకు చాలా సంతోషానిచ్చిందని మోదీ ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story