Mississippi: అమెరికాలో న్యూ ఇయర్ పార్టీలో కాల్పులు.. ముగ్గురు మృతి..

Mississippi: అమెరికాలో న్యూ ఇయర్ పార్టీలో కాల్పులు.. ముగ్గురు మృతి..
X
Mississippi: న్యూఇయర్‌ వేడుకలకు వచ్చిన దుండగులు వేడుకలను మొదలైన కాసేపటికి తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

Mississippi: అమెరికాలో మరోసారి గన్‌ఫైర్‌ చోటుచేసుకుంది. మిస్సిస్సిపీలోని గల్ప్‌ ఫోర్ట్‌ న్యూ ఇయర్‌ పార్టీలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, పలువురికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. న్యూఇయర్‌ వేడుకలకు వచ్చిన దుండగులు వేడుకలను మొదలైన కాసేపటికి తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. చనిపోయిన ముగ్గురిలో ఓ బాలుడు కూడా ఉన్నారు. కాల్పలు శబ్దం వినడంతోనే జనం పరుగులు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు.. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

Tags

Next Story