New York: న్యూయార్క్ కాల్పుల ఘటనలో 29కు చేరిన గాయపడ్డవారి సంఖ్య.. అందులో భారతీయులు కూడా..

New York: న్యూయార్క్ కాల్పుల ఘటన టెర్రరిస్ట్ అటాక్‌ను తలపించింది. గ్యాస్ మాస్క్ పెట్టుకున్న ఆగంతకుడు.. స్మోక్ గ్రెనేడ్ విసిరి కాల్పులకు తెగబడ్డాడు. బ్యారేజ్‌లోని 33 బుల్లెట్లు ఖాళీ అయ్యేంత వరకు బ్రూక్‌లైన్ సబ్‌వేలోని ప్రయాణికులపై ఫైరింగ్ జరిపాడు. దీంతో బ్రూక్లైన్ సబ్‌వే మొత్తం రక్తసిక్తమైంది. ఈ ఘటనలో పలువురు భారతీయులు కూడా గాయపడ్డారు.
సంఘటనా స్థలంలో 9mm సెమీ ఆటోమేటిక్ హ్యాండ్‌గన్ దొరికింది. ఆ వెపన్ జామ్ అవడంతో అక్కడే వదిలేసి పారిపోయాడు. దీంతో దుండగుడు వీలైనంత మంది ప్రాణాలు తీయాలనే ఉద్దేశంతోనే వచ్చాడని న్యూయార్క్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలోకనీసం పది మందికి పైగా బుల్లెట్ గాయాలయ్యాయని, గ్యాస్ పీల్చడం కారణంగా మొత్తం 29 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
వీరిలో ఐదు మంది పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ.. బతికే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఓ వ్యాన్‌లో వచ్చాడు. దీంతో వ్యాన్‌ను రెంట్‌కి ఇచ్చిన వారిని ఆరాతీశారు. ఫిలడెల్ఫియా, విస్కాన్సిన్ అడ్రస్సులు ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
దుండగుడికి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా 50వేల డాలర్లు ఇస్తామంటూ న్యూయార్క్ పోలీసులు ప్రకటించారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఎక్కువగా ఆసియా దేశాల వాళ్లే నివసిస్తుంటారు. ఘటన జరిగిన వెంటనే న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ స్పందించింది. వివరాల కోసం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com