పిచ్చి పీక్స్.. ఒక్క రోజులో పది వ్యాక్సిన్‌లు..

ఒక్క వ్యాక్సిన్ వేయించుకోడానికి భయపడి ఛస్తుంటే.. ఏకంగా పది వ్యాక్సిన్‌లు వేయించుకున్నాడట ఈ మహానుభావుడు.. కరోనా కాదు కదా దాని తాత వచ్చిన తననేం చేయకూడదని అన్ని వ్యాక్సిన్‌లు వేయించుకున్నట్టున్నాడు. ఈ స్పెషల్ క్యారెక్టర్ న్యూజీలాండ్‌కు చెందిన వ్యక్తి. ఇది నిజమా కాదా అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆగమేఘాల మీద దర్యాప్తు ప్రారంభించింది. సదరు వ్యక్తి వేర్వేరు గుర్తింపు కార్డులతో వ్యాక్సిన్ వేయించుకున్నాడని విచారణలో తేలింది. దీంతో ఆందోళన చెందిన మంత్రిత్వశాఖ ఆ వ్యక్తి ఆరోగ్యం గురించి ఆరా తీసింది. తక్షణమే అతడిని వైద్యుని వద్దకు పంపించింది. ఎవరి ఆరోగ్యాన్ని బట్టి వారు వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇలా మరొకరి గుర్తింపు కార్డుతో వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా ప్రమాదం అని న్యూజీలాండ్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హెలెన్ ప్రజలను హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com