New York Shootout: న్యూయార్క్‌లో జరిగిన కాల్పుల్లో ఎవరూ మరణించలేదంటున్న పోలీసులు..

New York Shootout: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూయార్క్ సబ్‌వే పార్క్‌లోని 36 స్ట్రీట్ స్టేషన్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు తుపాకీ కాల్పులు జరిగాయి. ఓ అనుమానితుడు భవన నిర్మాణ కార్మికుడి దుస్తుల్లో గ్యాస్ మాస్క్ పెట్టుకుని..అక్కడి ప్రయాణికులపై కాల్పులకు తెగబడ్డాడు. అప్పుడే ఫ్లాట్‌ఫారమ్ మీదకు వచ్చిన ఆర్ లైన్ ట్రైన్‌లోకి స్మోక్ బాంబ్ విసిరి కాల్పులు జరిపాడని అక్కడి వారు చెప్తున్నారు.
కాల్పుల కారణంగా కొందరు ప్రయాణికులు రక్తపు మడుగులో ఫ్లాట్‌ఫారమ్ మీద పడిపోయారు. ఈ ఘటనలో మొత్తంగా 13 మంది గాయపడ్డారని పోలీసులు చెప్తున్నారు. కాల్పులు జరిపిన వెంటనే దుండగుడు అక్కడ్నుంచి పారిపోయాడు దుండగుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. స్మోక్ బాంబు కారణంగా స్టేషన్‌లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
ప్రమాదం విషయం తెలియగానే ఫైర్ సేఫ్టీ సిబ్బంది, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఘటనా స్థలంలో పేలని పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో సబ్ వేలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్. న్యూయార్క్ అధికారులతో మాట్లాడారు. గన్ కల్చర్ కంట్రోల్‌పై కొత్త నిబంధనలు ప్రకటించిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com