ఆ దేశంలో 11 రోజులు నవ్వడం, మద్యం సేవించడం, షాపింగ్ చేయడం నిషేధం.. ఎందుకంటే..

ఉత్తర కొరియా అని కూడా పిలువబడే డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా తన దేశ ప్రజలను ఉద్దేశించి కొన్ని కఠినమైన ఉత్తర్వులు జారీ చేసింది. నవ్వడం, మద్యం సేవించడం, షాపింగ్ చేయడంపై కఠినమైన నిషేధాన్ని విధించింది. డిసెంబర్ 17 (శుక్రవారం) నుండి దేశం 11 రోజుల సంతాప దినాలలోకి ప్రవేశిస్తున్నందున నిషేధం విధించబడింది.
కిమ్ జోంగ్ ఇల్ మరణించి 10 సంవత్సరాలు కావడంతో ప్రభుత్వం సంతాప దినాలు పాటిస్తోంది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే, వారిని అరెస్టు చేస్తామని ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక పేర్కొన్నారు. "నిషేధ సమయంలో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా, మీరు బిగ్గరగా ఏడవకూడదు.
సంతాప కాలంలో పుట్టినరోజులను కూడా జరుపుకోకూడదు "అని తెలిపారు. గతంలో సంతాప సమయంలో తాగి పట్టుబడిన వారు చాలా మంది ఉన్నారు. వారిని నేరస్థులుగా పరిగణించి వారిని బంధించి తీసుకువెడతారు.. తిరిగి వాళ్లు కనిపించరు. ప్రతి సంవత్సరం మాదిరిగానే, కిమ్ తన తండ్రి స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com