Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు ఖాయం..?
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు ఖాయంగా కనిపిస్తోంది. ఖాన్‌కు లభించిన ప్రొటెక్షన్ బెయిల్ గడువు ముగిసిన వెంటనే ఆయనను అరెస్టు చేస్తామని పాక్ ఇంటీరియర్ మినిస్టర్ రానా సనావుల్లా వెల్లడించారు. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్‌పై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఆయనకు సోమవారం ప్రీ-అరెస్టు బెయిల్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు మంజూరు చేసింది. దీంతోపాటు ఖాన్ యాంటీ టెర్రర్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.
మరోవైపు దేశ ఇంటీరియర్ మినిస్ట్రీ నుంచి ప్రధాని షాబాజ్ షరీఫ్ కార్యాలయానికి ఓ లేఖ వెళ్లిందని.. దీనిలో ఇమ్రాన్ అరెస్టుకు సంబంధించిన అనుమతులు కోరారని ప్రచారం జరుగుతోంది. ఇంటీరియర్ మంత్రి రానా సనావుల్లా తాజాగా దీనిని ధ్రువీకరించారు. పీటీఐ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కు మంజూరు చేసిన బెయిల్ గడువు ముగిసిన రోజే అరెస్టు చేస్తామని తెలిపారు. ఆగస్టు 20న ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రభుత్వ అధికారులు, మహిళా జడ్జి, పోలీసులపై ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఆయనపై ఉగ్రవాద నిరోధక చట్టం సెక్షన్-7 కింద కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు తాజాగా ఆయనపై కోర్టు ధిక్కార నేరం కింద కూడా కేసు నమోదు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com