Pakistan: అవిశ్వాస తీర్మానంలో కుప్పకూలిన ఇమ్రాన్ ఖాన్ సర్కార్.. ఆ దేశ చరిత్రలో మొదటిసారి ఇలా..

Pakistan: అవిశ్వాస తీర్మానంలో కుప్పకూలిన ఇమ్రాన్ ఖాన్ సర్కార్.. ఆ దేశ చరిత్రలో మొదటిసారి ఇలా..
Pakistan: పాకిస్తాన్‌లో రాజకీయ పరిణామాలు క్షణాల్లో మారిపోయాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Pakistan: పాకిస్తాన్‌లో రాజకీయ పరిణామాలు క్షణాల్లో మారిపోయాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలింది. అర్ధరాత్రి పాక్‌ నేషనల్‌ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌ఖాన్‌ సర్కార్‌ కుప్పకూలింది. అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరైన ఇమ్రాన్‌ఖాన్‌కు బలం లేకపోవడంతో నెగ్గలేకపోయారు. ఆయన వర్గం సభ నుంచి వాకౌంట్‌ చేసింది.

ఇమ్రాన్ స‌ర్కారుపై విప‌క్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జ‌రిగి తీరాల్సిందేన‌ని పాకిస్తాన్‌ సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై అర్ధరాత్రి 12 గంటలకు జాతీయ అసెంబ్లీలో ఓటింగ్‌ జరిగింది. 174 మంది సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఇమ్రాన్‌... అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు.

ఓటింగ్‌కు ముందు అసెంబ్లీ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌లు రాజీనామా చేశారు. దీంతో ప్యానల్‌ ఛైర్మన్‌ అయాజ్‌ సిద్దీఖ్‌ సమక్షంలో ఓటింగ్‌ నిర్వహించారు. అంతకముందు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేశాయి. అయితే పలు మార్లు సభ వాయిదా పడుతూ అర్థరాత్రి వరకు కొసాగింది. అజెండాలో ఓటింగ్‌ నాలుగో అంశంగా ఉండగా… ఓ వ్యూహం ప్రకారం మంత్రులు ఒకరి తర్వాత మరొకరు సుదీర్ఘంగా ప్రసంగాలు కొనసాగించారు.

ఓటింగ్‌ నిర్వహించాలని ప్రతిపక్షాలు పదేపదే గగ్గోలు పెట్టినా… విదేశీకుట్రపై ముందు తేలుద్దామంటూ స్పీకర్‌ అస్‌ ఖైసల్‌ సాయంతో అధికార పక్షం చర్చ సాగదీసింది. అయితే ఎట్టకేలకు జరిగిన ఓటింగ్‌లో ఇమ్రాన్‌ ఓటమిపాలయ్యారు. అయితే ఓటమిని ముందే ఊహించిన ఇమ్రాన్‌... సభలో ఓటింగ్‌ జరుగుతున్న సమయంలోనే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు పాకిస్తాన్‌ ముస్లీంలీగ్‌ నవాజ్‌ పార్టీ అధినేత షెహబాజ్‌ షరీఫ్‌... ఇవాళ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది

Tags

Read MoreRead Less
Next Story