Pakistan On Raja Singh : రాజాసింగ్ వ్యాఖ్యలపై పాక్ ప్రభుత్వం కామెంట్స్..

Pakistan On Raja Singh : సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది. రాజాసింగ్ వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతిస్తున్నాయంటూ ఖండించింది. బీజేపీ నాయకులు ముస్లింలను బాధపెట్టే ఇటువంటి పదేపదే అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఆపడానికి చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. గత మూడు నెలల్లో బీజేపీ సీనియర్ నాయకుడు ప్రవక్తపై అగౌరవంగా వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి అని పాక్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
అత్యంత అవమానకరమైన వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్ల మంది ముస్లింల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి అని ఓ ప్రకటనలో తెలిపింది. ఏదో మొక్కుబడిగా చర్యలు తీసుకున్నారని విమర్శించింది. అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే రాజా సింగ్ బెయిల్‌పై విడుదల కావడం అత్యంత ఖండనీయమని ఆ ప్రకటనలో తెలిపింది. తక్షణమే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని పాకిస్థాన్ డిమాండ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com