Paris Firing : కారులోంచి దిగి ఫైరింగ్.. ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు..

Paris Firing : కారులోంచి దిగి ఫైరింగ్.. ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు..
X
Paris Firing : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా...మరో 4గురు తీవ్ర గాయాల పాలయ్యారు

Paris Firing : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఓ బార్‌ దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా...మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. కాల్పులకు పాల్పడిన ఇద్దరు దుండగుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఐతే కాల్పులకు గల ఉద్దేశం ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. కాల్పులకు పాల్పడిన మరో దుండగుడి కోసం గాలింపు జరుపుతున్నట్లు తెలిపారు.

శిషా కేఫు దగ్గర కారు ఆపి, కిందకు దిగి అక్కడ టెర్రస్ పైనున్నవారిపై విఛక్షణారహితంగా కాల్పులు జరిపారు. స్థానికులు ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో దుండగుడు పరారీలో ఉన్నాడు. అయితే కాల్పులకు కారణమేంటో తెలియాల్సి ఉంది. ఐసిస్ ఉగ్రవాదుల పనేనా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story