Sri Lanka: శ్రీలంకలో కట్టలు తెంచుకున్న ప్రజల కోపం.. మంత్రి కాన్వాయ్‌పై దాడి..

Sri Lanka: శ్రీలంకలో కట్టలు తెంచుకున్న ప్రజల కోపం.. మంత్రి కాన్వాయ్‌పై దాడి..
Sri Lanka: నిరసరకారుల్లో కొందరు రాజపక్స మద్దతుదారులు ఉండగా.. మరికొందరు వ్యతిరేకులు ఉన్నారు.

Sri Lanka:ఓవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం.. మరోవైపు భగ్గమంటున్న నిరసన జ్వాలలు. ప్రభుత్వంపై నిరసనలు, చెలరేగుతున్న హింసాత్మక ఘటనలతో రావణకాష్టంగా మారిన శ్రీలంక. కొన్నాళ్లుగా రాజకీయ అనిశ్చితితో అల్లాడుతోంది శ్రీలంక. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. తినడానికి తిండి కూడా దొరకక ప్రజలు రోడెక్కి ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు.

ప్రజల ఆగ్రహం నిరసనలకు దారితీస్తే ఎలా ఉంటుందో శ్రీలంక పరిస్థితి చూస్తే తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిలోనే ఒత్తిడిని తట్టుకోలేక మహింద రాజపక్స కూడా ప్రధానిగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం రణిల్ విక్రమ సింఘే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ మార్పుతో అయినా ప్రజలు కాస్త శాంతిస్తారు అనుకుంటే అలా జరగడం లేదు.

ప్రధాని రాజీనామా నిరసనకారులలో మరింత చిచ్చుపెట్టింది. నిరసనల్లో భాగంగా మాజీ కేంద్ర మంత్రి కాన్వాయ్‌ను చుట్టుముట్టిన నదిలోకి తోశారు ప్రజలు. ఆ సమయంలో కార్లలో ఎవరూ లేరు కాబట్టి ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​అవుతోంది. అయితే నిరసరకారుల్లో కొందరు రాజపక్స మద్దతుదారులు ఉండగా.. మరికొందరు వ్యతిరేకులు ఉన్నారు. దీంతో ఎమర్జెన్సీ విధించినా పరిణామాలు ఏ మాత్రం అదుపులోకి రావడం లేదు.


Tags

Read MoreRead Less
Next Story