Philippines: ఫిలిప్పీన్స్‌లోని యూనివర్సిటీలో కాల్పులు.. మాజీ మేయర్‌తో సహా ముగ్గురు మృతి..

X
By - Divya Reddy |24 July 2022 7:00 PM IST
Philippines: ఫిలిప్పీన్స్‌లోని ఓ యూనివర్సిటీలో సాయుధులు జరిపిన కాల్పులు జరపడంతో మాజీ మేయర్ సహా ముగ్గురు మృతి చెందారు
Philippines: ఫిలిప్పీన్స్ రాజధాని ప్రాంతంలోని ఓ యూనివర్సిటీలో సాయుధులు జరిపిన కాల్పులు జరపడంతో మాజీ మేయర్ సహా ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అటెనియో డీ మనీలా యూనివర్సిటీ గేటు దగ్గర ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పులకు తెగబడ్డ సాయుధుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని నుంచి రెండు గన్స్ స్వాధీనం చేసుకున్నారు. లా స్కూల్‌లో జరగాల్సిన గ్రాడ్యుయేషన్ వేడుకను కాల్పుల ఘటనతో రద్దు చేశారు. అయితే, కాల్పులకు కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనను క్యూజోన్ నగర మేయర్ జాయ్ బెల్మోంటే ఖండించారు. ఇలాంటి సంఘటనలకు సమాజంలో స్థానం లేదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com