Piyush Goyal: పియూష్ గోయల్ ఆస్ట్రేలియా టూర్.. రాజకీయంగా హాట్ టాపిక్..
Piyush Goyal: కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఉన్నపళంగా ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పియూష్ గోయల్ ఆస్ట్రేలియా టూర్ మూడు రోజులు కొనసాగనుంది. మొదటి రోజు ఆయన యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్‌కు వెళ్లారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కా్ట్ మార్రిసన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చాలా మంచి స్నేహం ఉందని పియూష్ అన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్‌లో ప్రసంగించారు పియూష్ గోయల్. కోవిడ్ 19 తర్వాత ప్రపంచంలోని పరిస్థితులు అన్ని మారిపోయాయన్నారు పియూష్ గోయల్. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇండియా, ఆస్ట్రేలియా కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. పియూష్ గోయల్ మొదటిరోజు ఆస్ట్రేలియా టూర్‌లో ఆయనతో పాటు ఆస్ట్రేలియన్ ట్రేడ్ మినిస్టర్స్ డ్యాన్ టేహన్‌తో పాటు యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ ఛాన్సలర్ ఎల్లాన్ మయర్స్ ఉన్నారు.
పియూష్ గోయల్ సడన్ ఆస్ట్రేలియా టూర్‌కు కారణం ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఆస్ట్రేలియా, ఇండియా మధ్య ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందం జరిగిన తర్వాతే పియూష్ ఆస్ట్రేలియాకు వెళ్లడం గమనార్హం. ఈ రెండు దేశాల మధ్య ట్రేడింగ్ సంబంధాలు మెరుగుపరచడమే పియూష్ గోయల్ ఆస్ట్రేలియా టూర్ లక్ష్యమని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com