Iran : ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు..

Iran : ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు..
Iran : ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. అమినీ మరణం తర్వాత ఇవి మరింతగా పెరిగాయి

Iran : ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. అమినీ మరణం తర్వాత ఇవి మరింతగా పెరిగాయి. సోషల్‌ మీడియా వేదికగా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మర్డర్ పెట్రోల్స్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిరసన తెలుపుతున్న మహిళలను ఈడ్చుకుంటూ వెళ్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు మహిళలు అమినీకి మద్దతుగా జుట్టు కత్తిరించుకుంటున్నారు. హిజాబ్‌ను కాల్చి నిరసన తెలుపుతున్నారు.

తలను పూర్తిగా కప్పుకోవాలన్న నియమాన్ని పాటించలేదన్న ఆరోపణలతో అరెస్టయిన మహ్సా అమినీ అనే 22 ఏళ్ల ఇరాన్‌ యువతి చనిపోవడంతో ఆందోళనలు తీవ్రమయ్యాయి. మంగళవారం టెహ్రాన్‌లో అమినీని అరెస్టు చేసిన తర్వాత ఆమెను పోలీస్ వ్యాన్ ఎక్కించి తీవ్రంగా కొట్టారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఐతే పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. అమనీకి హఠాత్తుగా గుండెకు సంబంధించిన సమస్య వచ్చిందని చెప్తున్నారు. అమినీని అరెస్టు చేసిన కొద్దిసేపటికే హాస్పిటల్‌లో చేర్చినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దాదాపు నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన అమినీ హాస్పిటల్‌లో శుక్రవారం చనిపోయింది. హిజాబ్‌ గురించి చైతన్యం కల్పించడం కోసమే అమినీని అరెస్టు చేసినట్లు ఇరాన్‌ పోలీసులు చెప్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story