Pakistan: మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు.. అందుకే ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ..

Pakistan: ప్రపంచంలో ఎక్కడైనా మహిళపై అత్యాచారాలు, హత్యల ఘటనలు ఎక్కువయిపోతున్నాయి. అది ఏ దైశమైనా.. అక్కడ ఎన్ని కఠినమైన చట్టాలు అమలులో ఉన్నా.. అలాంటి ఘటనల సంఖ్య మాత్రం అదుపులోకి రావడం లేదు. అందుకే పాకిస్థాన్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో ఇలాంటి ఘటనలను అదుపులోకి తీసుకురావడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ మంత్రి అత్తా తరార్ తెలిపారు.
పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో రోజుకు కనీసం నాలుగు నుండి అయిదు రేప్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పంజాబ్‌లో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇది తాత్కాలిక నిర్ణయమే అని.. త్వరలోనే ఈ ఘటనలను అడ్డుకునే పరిష్కారం కనిపెడతామని తరార్ అన్నారు. మహిళలపై మాత్రమే కాదు చిన్నారులపై కూడా లైంగిక దాడులు పెరుగుతున్నాయన్నారు. అందుకే దీని పరిష్కారం కోసమే ప్రస్తుతం ఎమర్జెన్సీ విధించామని తెలిపారు.
ఈ ఎమర్జెన్సీ సమయంలో మహిళా హక్కుల సంఘాలు, టీచర్లు, అటార్నీలను సంప్రదించి ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతామన్నారు తరార్. చాలా వరకు అత్యాచార కేసుల్లో నిందితుల్లో అరెస్టు చేశామని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో పాకిస్థాన్ 153వ స్థానంలో ఉంది. ఇకపై తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్త వహించాలని తరార్ కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com