Queen Elizabeth : బ్రిటన్ రాణికి తీవ్ర అస్వస్థత..

Queen Elizabeth : బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.. దీంతో ప్రత్యేక వైద్య బృందం ఆమెను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.. ఈ విషయాన్ని బకింగ్‌హమ్ ప్యాలెస్ వెల్లడించింది.. అటు ఎలిజబెత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులంతా లండన్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు.
గత ఏడాది నుంచే ఎలిజబెత్‌ను ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి.. నడవడం, నిలబడటం కూడా ఇబ్బందిగా మారింది.. అప్పట్నుంచి అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.. రెండ్రోజుల క్రితమే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ స్కాట్‌లాండ్‌కు వెళ్లి రాణి ఎలిజబెత్‌ను కలుసుకున్నారు.. అటు ఆమె ఆరోగ్యానికి సంబంధించి తనతో సహా యావత్ దేశం ఆందోళన చెందుతోందని లిజ్ ట్రస్ అన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com