Rupert Murdoch: నాలుగో భార్య కూడా నచ్చలేదు..! 91 ఏళ్ల వయసులో విడాకులు..

Rupert Murdoch: నాలుగో భార్య కూడా నచ్చలేదు..! 91 ఏళ్ల వయసులో విడాకులు..
Rupert Murdoch: ముందుగా రూప్టర్ మార్దోక్.. ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ పాట్రీషియా బూకర్‌ను వివాహం చేసుకున్నాడు

Rupert Murdoch: ఈమధ్యకాలంలో బిజినెస్ ఫీల్డ్‌లో విడాకులు తీసుకునేవారి సంఖ్య ఎక్కువయ్యింది. ఎంతోకాలం కలిసున్న భార్యాభర్తలు కూడా విడిపోయి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ముందుగా బిల్ గేట్స్, ఇటీవల సర్జీ బ్రినే దీనికి ఉదాహరణ. ఇక తాజాగా మరో బడా వ్యాపారవేత్త కూడా తన నాలుగో భార్యకు విడాకులు ఇవ్వనున్నాడనే వార్త వైరల్‌గా మారింది.

ప్రపంచ మీడియా మొఘల్‌గా పిలుచుకునే వ్యక్తి 91 ఏళ్ల రూపర్ట్ మర్దోక్‌. అమెరికాలోనే ప్రముఖ మీడియా సంస్థలు.. మర్దోక్ స్థాపించిన న్యూస్ కార్పొరేషన్ ద్వారానే రన్ అవుతూ ఉన్నాయి. అలాంటి మార్దోక్ ఇటీవల తన నాలుగో భార్య జెర్రీ హాల్‌ (65)కు విడాకులు ఇచ్చాడన్న వార్త సంచలనంగా మారింది. ఈ విషయాన్ని వీరు ఇప్పటివరకు తమ సన్నిహితులతో కూడా పంచుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ముందుగా రూప్టర్ మార్దోక్.. ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ పాట్రీషియా బూకర్‌ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు దాదాపు పది సంవత్సరాలు కలిసున్న తర్వాత విడిపోయారు. ఆ తర్వాత మార్దోక్.. స్కాటిక్ జర్నలిస్ట్ అన్నా మరియా మన్‌‌ను వివాహమాడాడు. తనతో దాదాపు 32 ఏళ్లు కలిసున్న తర్వాత విడాకులు తీసుకున్నాడు. తర్వాత చైనాకు చెందిన వెండి డెంగ్‌తో పదిహేనేళ్లు కలిసుండి విడిపోయాడు.


ఇక రూపర్ట్ మార్దోక్ నాలుగో భార్య జెర్రీ హాల్‌కు కూడా ఇది రెండో వివాహం. ప్రస్తుతం వీరిద్దరికీ కలిపి మొత్తంగా 10 మంది పిల్లలు ఉన్నారు. 2016లో వీరిద్దరు లండన్‌లో పెళ్లి చేసుకున్నారు. విడాకులు వార్తలపై ఇప్పటివరకు మార్దోక్, జెర్రీ ఏ విధంగానూ స్పందించలేదు.

Tags

Read MoreRead Less
Next Story