Russia : సైన్యాన్ని మరింత పెంచుకుంటున్న రష్యా..

Russia : ఉక్రెయిన్‌తో 7నెలలుగా రష్యా దళాలు పోరాడుతూనే ఉన్నాయి. తాజాగా దేశంలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు రష్యా ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వీళ్లందర్నీ మిలటరీకి సేవ చేయాల్సిందిగా ప్రభుత్వం కోరింది. దీంతో ఎయిర్‌లైన్స్ కంపెనీలు మిలటరీకి వెళ్లే ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేసే పనిలో పడ్డాయి.
దేశంలోని రిజర్వ్ దళాల్లో కొందరిని ఉపయోగించుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలు జారీచేశారు. ఈ కారణంగానే రష్యాలోని ఐదు ప్రముఖ ఎయిర్‌లైన్స్, 10 ఎయిర్‌పోర్టుల్లో పనిచేస్తున్న సిబ్బంది కచ్చితంగా మిలటరీలో చేరాలంటూ నోటీసులు అందాయని తెలుస్తోంది. దీంతో సుమారు ఐదు కంపెనీలు తమ ఉద్యోగుల్లో మిలటరీ సేవల నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన వారి జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డాయని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com