Russia President Vladimir Putin: రష్యా అధ్యక్షుడు 'పుతిన్' స్పెషల్ మెనూ.. అంత ఫిట్‌ అందుకేనేమో..

Russia President Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పెషల్ మెనూ.. అంత ఫిట్‌ అందుకేనేమో..
X
Russia President Vladimir Putin: పొరుగు దేశాలతో సాన్నిత్యం నెరపడంతో పాటు అక్కడి స్థానిక వంటకాలను ఆస్వాదిస్తారు.. అప్పుడే అలవాటైంది గ్రీన్ టీ ఆయనకు.

Russia President Vladimir Putin: 21వ వార్షిక దైపాక్షిక సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు వచ్చారు. ఆయన ఏం తింటారు.. ఎలాంటి ఆతిధ్యాన్ని ఇష్టపడతారు అని తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. అందరిలా ఉదయాన్నే లేచి ఓ కప్పు కాఫీ తాగి సరిగ్గా ఎనిమిది గంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేస్తే నథింగ్ స్పెషల్.. అధ్యక్షుడు అంటే సంథింగ్ స్పెషల్ ఉండాల్సిందే అంటున్నారు వ్లాదిమర్ పుతిన్.

అగ్రరాజ్యాల అధ్యక్షులందరూ పుతిన్‌ని చూసి నేర్చుకోవాల్సిందేనేమో. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటూ ప్రపంచనేతల దృష్టిని ఆకర్షిస్తారు. ఇంతకీ మీ హెల్త్ సీక్రెట్ ఏంటి సార్ అని ఆసక్తిగా అడిగే వారికి బీట్‌రూట్, ముల్లంగి రసంతో తయారు చేసిన కాక్‌టెయిల్ నా బ్యూటీ సీక్రెట్ అని నవ్వేస్తారు అధ్యక్షులు పుతిన్.

గంజిని కూడా వదలనండి.. వేడి వేడి గంజిలో ఓ చిటికెడు ఉప్పువేసి సిప్ చేస్తే.. ఆహా ఎంత బావుంటుంది.. అది తెలుగువారి మెనూ అయినా ఇంగ్లీషు వారికి కూడా తెగ నచ్చేసినట్టుంది.. ఇదిలా ఉంటే ఆహారం కోసం ఎక్కువ సమయం కేటాయించనని అంటారు అధ్యక్షుల వారు. కూరగాయలు అన్నీ ఇష్టంగా తింటారు. అందులో టమోటా, దోసకాయ, సలాడ్లు అంటే మరి ఇష్టం. చేపలు, మాంసం కూడా ఇష్టంగా ఆరగిస్తారు. స్వీట్స్ చాలా తక్కువ.. అప్పుడప్పుడు ఐస్‌క్రీమ్ రుచి చూస్తా అని అంటున్నారు.

పొరుగు దేశాలతో సాన్నిత్యం నెరపడంతో పాటు అక్కడి స్థానిక వంటకాలను ఆస్వాదిస్తారు.. అప్పుడే అలవాటైంది గ్రీన్ టీ ఆయనకు. ప్రయాణంలో ఉన్నప్పుడు రాత్రి పూట భోజనం చేయరు. మధ్యాహ్నం కూడా ఎక్కువగా పండ్లు తినడానికి ఇష్టపడతారు. జర్నలిస్టులతో కలిసి పుతిన్ భోజనం చేసిన ప్రతిసారీ ఆయన ఎంచుకున్న వంటకం చర్చనీయాంశం అవుతుంటుంది. ఆయన ఆర్డర్ చేసిన వంటకాలన్నీ వెరైటీగా ఉంటాయి మరి.

చెఫ్ అనటోలీ గాల్కిన్.. పుతిన్ వైన్ లేదా బీర్‌ను ఇష్టపడతారని చెప్పారు. ఓ గ్లాస్‌లో 50 ఎ.ఎల్ షాంపైన్, పుదీనా, ఐస్ క్యూబ్స్, నిమ్మరసం కలిపి తాగడం అంటే ఆయనకు మహా ఇష్టం అని గాల్కిన్ అంటారు. భోజనం తర్వాత వోడ్కా తాగేందుకు కూడా పుతిన్ ఆసక్తి చూపుతారని ఆయన వివరించారు.

అందుకే 69 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నారు.. అధ్యక్షుడిగా ఓ దేశాన్ని నడిపిస్తున్నారు. ఇతర దేశాధినేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Tags

Next Story