Russia Ukraine War : రష్యా దాడిలో మరో 13 మంది ఉక్రెయిణిలు మృతి..

Ukraine Russia War : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. సెంట్రల్ ఉక్రెయిన్‌లో రష్యా జరిపిన దాడుల్లో 13 మంది చనిపోయారని స్థానిక గవర్నర్ వాలెంటిన్ తెలిపారు. ఈ భయంకరమైన రాత్రి.. దాడుల్లో 11 మంది చనిపోయారని టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత మరికొద్ది సేపటికే మరో ఇద్దరు చనిపోయినట్లు తెలిపారు. మరోవైపు జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ నుంచి డ్నీపర్ నదికి అవతలి వైపున జరిగిన దాడుల్లో 12 మంది చనిపోయారని స్థానిక అధికారులు వెల్లడించారు.
రష్యా దాడుల్లో అడ్మినిస్ట్రేటివ్ భవనాలు దెబ్బతిన్నాయని, పాఠశాల, సాంస్కృతిక భవనం, నగర మండలి భవనం దెబ్బతిన్నాయని తెలిపారు. పట్టణంలో విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని, ఇదిలా ఉండగా.. సోమవారం ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని అమెరికా ప్రకటించింది. రాకెట్లు, మందుండు సామగ్రి, ఇతర ఆయుధాలను యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ నేరుగా ఉక్రెయిన్ సాయుధ దళాలకు పంపిణీ చేస్తున్నది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com