international

Russia Vs America : అమెరికా బందీలో ఉన్న రష్యన్ ఆర్మ్స్ డీలర్.. అతని కోసం యుద్ధానికి కూడా సిద్ధమయ్యారు..

Russia Vs America : అమెరికా-రష్యా మధ్య సంబంధాలు కోల్డ్‌వార్‌ దిశగా సాగుతున్నాయి

Russia Vs America : అమెరికా బందీలో ఉన్న రష్యన్ ఆర్మ్స్ డీలర్.. అతని కోసం యుద్ధానికి కూడా సిద్ధమయ్యారు..
X

Russia Vs America : అమెరికా-రష్యా మధ్య సంబంధాలు కోల్డ్‌వార్‌ దిశగా సాగుతున్నాయి.ఉక్రెయిన్‌ వార్‌ తర్వాత రష్యాను పూర్తిగా తొక్కి పెట్టాలని అమెరికా ట్రై చేస్తుంటే అదే స్థాయిలో మాస్కో నుంచి కౌంటర్‌ ఏటాక్‌ వస్తుంది. తమ వ్యాపారవేత్తలను కారణం లేకుండా బంధించారని రష్యా ఆరోపిస్తుండగా..తమ ప్లేయర్‌ని మాస్కో అనవసర కేసులో ఇరికించిందని అమెరికా ఆరోపిస్తోంది.. మరోవైపు బైడెన్‌ సర్కారు చరిష్మా ఇప్పటికే బాగా దెబ్బతినడంతో..లేటెస్ట్‌గా స్టార్‌ ప్లేయర్‌,రిటైర్డ్ మేజర్‌ను విడిపించి పరువు కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది అమెరికా. మరోవైపు రష్యా కూడా ఇదే అదనుగా భావించి కరుడుగట్టిన వెపన్‌ మర్చంట్‌ విక్టర్‌ బౌట్‌ను విడిపించాలని ప్లాన్‌ చేస్తోంది.

ఇక 55ఏళ్ల విక్టర్‌ బౌట్‌ గతంలో సోవియట్‌ మిలట్రీలో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేశాడు.1967 తజఖిస్థాన్‌లో పుట్టిన బౌట్‌ సోవియట్‌ మిలటరీ ఇన్‌స్టిట్యూట్‌లో ఫారెన్‌ లాంగ్వేజస్‌ను చదివాడు.సోవియట్‌ పతనం తర్వాత ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ ఏజెంట్‌గా మారాడు.ఆ తర్వాత ఆయుధ వ్యాపారిగా మారి ఉక్రెయిన్‌ తదితర ప్రాంతాల నుంచి ఆయుధాలను ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో అమ్మాడు.

ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిస్ట్,రెబల్ గ్రూపులతో సంబంధాలు పెట్టుకొన్నాడు. బౌల్ట్‌ మొదట్లో సోవియట్‌ యూనియన్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ సంస్థ జీఆర్‌యూ సాయంతో ఓ స్టార్టప్‌ మొదలుపెట్టాడు. విక్టర్‌కు సొంతగా పెద్దసంఖ్యలో విమానాలున్నాయి.యకోవ్‌లెవ్‌ కార్గో విమానాలు ఉన్నాయి.అమెరికాలో ట్విన్‌ టవర్స్ పేల్చివేత జరిగే వరకు విక్టర్‌ భారీగా వెపన్స్‌ అమ్మాడు.

మరోవైపు విక్టర్‌ వద్ద ఉన్న విమానాలు రెగ్యులర్‌గా ఆఫ్రికా,ఆసియాతో పాటు ఇతర ఖండాలకు తిరిగేవి.2005లో అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రెజరీ కీలక నివేదిక ఇచ్చింది. విక్టర్‌ విమానాలు ట్యాంకులు,హెలికాప్టర్లు, టన్నుల కొద్దీ ఆయుధాలను ప్రపంచంలోని ఏమూలకైనా చేరవేయగలవని ఆ నివేదికలో తెలిపింది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాన్ని సోమాలియాకు చేర్చడానికి, ఐక్యరాజ్యసమితి ఆహార సాయాన్ని కాంగోకు చేర్చడానికి విక్టర్‌ విమానాలు వినియోగించారు. అల్‌ఖైదా, తాలిబన్లతో సబంధాలున్నట్లు విక్టర్‌పై ఆరోపణలు ఉన్నాయి.

ఇక వెపన్‌ డీలర్‌ బౌట్‌ అరెస్టు హాలీవుడ్‌ మూవీని తలపిస్తుంది. 2006లో అమెరికా అతని దగ్గర ఉన్న 30 డొల్ల కంపెనీల్లో 12 సంస్థల ఆస్తులను అటాచ్‌ చేసింది. అమెరికన్లతో లావాదేవీలు జరపకుండా ఆదేశాలు జారీ చేసింది. కానీ, విక్టర్‌ పలుకుబడితో అరెస్ట్ కాకుండా బయటపడ్డాడు. 2008లో పరిస్థితులు మారాయి.అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు థాయిల్యాండ్‌లో వేసిన ఉచ్చులో అతడు పడ్డాడు. అధికారులు కొలంబియాకు చెందిన ఎఫ్‌ఏఆర్‌సీ రెబల్స్‌ లాగా విక్టర్‌తో వెపన్‌ డీల్‌కి వెళ్లారు.కొలంబియాలోని అమెరికా హెలికాప్టర్ల కూల్చివేతకు అవసరమైన ఆయుధాలు ఇచ్చేందుకు కూడా విక్టర్‌ ఓకే చెప్పాడు.

ఆ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిన విక్టర్‌ను అరెస్ట్ చేసి 2010లో అమెరికాకు తరలించారు.2012లో 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది పెడరల్‌ కోర్ట్. ఎఫ్‌ఏఆర్‌సీ రెబల్స్‌కు వందల కొద్దీ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిసైల్స్‌ను, ఇరవై వేల ఏకే 47లను అమ్మేందుకు డీల్‌ కుదుర్చుకున్నరన్న అభియోగంపై ఈ శిక్షను విధించారు.

మరో వైపు రష్యా మాత్రం విక్టర్‌ను బెజినెస్‌మెన్‌గా చెబుతోంది. ఇటీవల విక్టర్‌ భార్య నిర్వహించిన పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌కు కు రష్యా సివిక్‌ ఛాంబర్‌ ను వాడుకొంది. మరో వైపు అమెరికాలోని బౌట్‌ డిఫెన్స్‌ లాయర్ల కథనం ప్రకారం..వాషింగ్టన్‌ ఉద్దేశపూర్వకంగానే విక్టర్‌ని టార్గెట్‌ చేసిందని వదిస్తున్నారు. బౌట్‌ విమానాలు గతంలో ఇరాక్‌ యుద్ధ సమయంలో అమెరికన్‌ కాంట్రాక్టర్లకు సాయం చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. బౌట్‌ కూడా తనపై కేసు రాజకీయ దురుద్దేశపూరితమైందని అంటున్నాడు.

ఇక అమెరికన్‌ ఉమెన్స్ నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ స్టార్‌ బ్రిట్నీ గ్రినెర్‌ను కొద్ది నెలల క్రితం అక్రమ మాదకద్రవ్యాల కేసులో రష్యాలో అరెస్టు చేశారు. మాజీ సైనికాధికారి పౌల్‌ వేలన్‌ను 2020లో గూఢచర్య నేరంపై అరెస్టు చేశారు. అయితే బైడెన్‌ సర్కార్‌ బ్రిట్నీ గ్రినెర్‌, పౌల్‌ వేలన్‌కు బదులు విక్టర్‌ బౌట్‌ను విడుదల చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ డీల్‌కు అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ వ్యతిరేకిస్తోంది. బైడెన్‌ నేరుగా ఈ వ్యవహారంలోకి దిగడంతో పావులు వేగంగా కదుపుతున్నారు. ఇదే జరిగితే రష్యాలో మళ్లీ పుతిన్‌ ఇమేజ్‌ భారీగా పెరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES