Salman Rushdie : సల్మాన్ రష్దీపై కత్తితో దాడి.. ఏమీచెప్పలేమంటున్న వైద్యులు..

Salman Rushdie : సల్మాన్ రష్దీపై కత్తితో దాడి.. ఏమీచెప్పలేమంటున్న వైద్యులు..
Salman Rushdie : వివాదాస్పద రచయిత సల్మాన్‌ రష్డీపై న్యూయార్క్‌లో హత్యాయత్నం జరిగింది.

Salman Rushdie : వివాదాస్పద రచయిత సల్మాన్‌ రష్డీపై న్యూయార్క్‌లో హత్యాయత్నం జరిగింది. ముస్లిం ఛాందసవాదుల నుంచి గతకొన్నేళ్లుగా బెదిరింపులు ఎదుర్కొంటున్న సల్మాన్ రష్డీని ఓ ఆగంతకుడు కత్తితో పొడిచాడు. న్యూయార్క్‌లోని చౌటాక్వా విద్యాసంస్థలో ఆయన ప్రసంగించబోతుండగా, ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చిన ఆగంతుకుడు ఆయనపై దాడి చేశాడు.

సల్మాన్ రష్దీని కిందపడేసి మెడ, పొట్టభాగంలో పలు సార్లు కత్తితో విచక్షణా రహితంగా ఆగంతకుడు పొడిచాడు. వెంటనే కొంత మంది అక్కడికి పరుగెత్తుకొచ్చి దాడి చేసిన వ్యక్తిని పక్కకు ఈడ్చేసి సల్మాన్ రష్దీని రక్షించారు. కత్తి పోట్లకు గురైన రష్దీ అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియలేదని న్యూయార్క్‌ పోలీసులు వెల్లడించారు.

80వ దశకంలో సల్మాన్ రష్దీ రచించిన ద శాటానిక్ వర్సెస్ అనే పుస్తకం వివాదాస్పదమైంది. ఇరాన్‌లో పరిస్థితులను ఇందులో వివరించారు. ఈ నవలతో వివాదాస్పద రచయితగా సల్మాన్ రష్డీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇస్లామిక్ ఛాందసవాదులను ఈ పుస్తకం తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. రష్దీ దైవదూషణకు పాల్పడ్డాడంటూ అతడిపై నిప్పులు చెరిగారు. అప్పట్లోనే సల్మాన్ రష్డీని ఉరి తీయాలని ఇస్లామిక్ సంఘాలు ఫత్వా జారీ చేశాయి. రష్దీని చంపినవారికి ఇరాన్ 3 మిలియన్ డాలర్ల నజరానా ప్రకటించింది.

1947లో ముంబయిలో జన్మించిన సల్మాన్‌ రష్దీ.. కొన్నాళ్ల తర్వాత బ్రిటన్‌కు తరలివెళ్లారు. రష్దీ రచించిన మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌ నవలకు 1981లో ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌ దక్కడంతో ఆయన ఫేమస్‌ అయ్యారు. అయితే ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పదయ్యాయి. ఆయనకు హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో గత మూడు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్న సల్మాన్ రష్డీ.. భారతీయ మోడల్ పద్మలక్ష్మీతో మూడేళ్లు కాపురం చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story