America: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. నలుగురిని చంపి ఆపై..
America: టెక్సాస్ ఘటన మరవక ముందే అమెరికాలో మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది.
BY Divya Reddy2 Jun 2022 9:20 AM GMT

X
Divya Reddy2 Jun 2022 9:20 AM GMT
America: టెక్సాస్ ఘటన మరవక ముందే అమెరికాలో మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఓక్లహామాలోని తుల్సాలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ ఆస్పత్రిలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. అయితే కాల్పుల తర్వాత తనను తాను కాల్చుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్థోపెడిక్ సర్జన్ కోసం దుండగుడు ఆస్పత్రికి వెళ్లాడు.
అయితే అక్కడ వైద్యుడు కనిపించకపోవడంతో విచక్షణారాహిత్యంగా కాల్పులు జరిపాడు. దీంతో భయాందోళనకు గురైన వైద్య సిబ్బంది వెంటనే రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల టెక్సాస్‌లోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 19 మంది చిన్నారులు సహా 21 మంది మృతి చెందారు.
Next Story