Cyril Ramaphosa: సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు కరోనా..

Cyril Ramaphosa (tv5news.in)
X

Cyril Ramaphosa (tv5news.in)

Cyril Ramaphosa: ప్రస్తుతం మళ్లీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Cyril Ramaphosa: ప్రస్తుతం మళ్లీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోసారి కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తోంది. ఇటీవల సౌతాఫ్రికాలో కొత్తగా పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ ఇంతకు ముందు వేరియంట్‌ల కంటే వేగంగా వ్యాపిస్తూ అందరినీ భయాందోళనలకు గురిచేస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు కూడా ఇప్పుడు కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది.

కోవిడ్ బారిన పడిన సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటున్నారని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఒమిక్రాన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. సౌతాఫ్రికాలోనే ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో ఆ దేశ అధ్యక్షుడికే కరోనా రావడం అందరినీ కలవరపెడుతోంది.

సిరిల్ రమఫోసాకు సోకింది ఒమిక్రాన్ వేరియంటా కాదా అన్న విషయాన్ని అధ్యక్ష కార్యాలయం స్పష్టం చేయలేదు. కానీ ఈ సమయంలో ఒమిక్రాన్ వేరియంటే వ్యాపించి ఉంటుందని సౌతాఫ్రికా ప్రజలు అనుకుంటున్నారు. కాగా సిరిల్ ఇప్పటికే తన రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

Tags

Next Story