Sri Lanka Crisis : కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడవద్దు.. మిలిటరీకి శ్రీలంక ప్రధాని ఆదేశాలు..

Sri Lanka Crisis : ఆందోళనకారులను అదుపుచేయడానికి ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనకాడవద్దని శ్రీలంక ప్రధాని విక్రమ్‌సింఘే మిలిటరీకి ఆదేశించారు. ఇటీవళ అధ్యక్షుడు భవనంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు ఈ రోజు ప్రధాని నివాసంలోకి దూసుకెళ్లిపోయారు. మిలిటరీ సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించినా ఆందోళనకారులు వెనక్కు తగ్గడంలేదు. శ్రీలంక ఆర్ధిక సంక్షోభం ఆ దేశ ప్రజల స్థితిని అల్లకల్లోలం చేసింది.
అధ్యక్షుడు గొటబయా రాజపక్స ఇప్పటికే దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే ఆయనను తప్పించడానికి భారత్ సహాయం చేసిందన్న ఆరోపణలను శ్రీలంకలోని భారత్ రాయబారం కొట్టివేసింది.
శ్రీలంకలో ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు దిగడం లేదు. కానీ అధికారంలో ఉన్న వారి నివాసాల్లోకి, అధికారిక భవనాల్లోకి చొచ్చుకెళ్లిపోతున్నారు. తాజాగా ప్రధాని మిలిటరీకి కఠినమైన ఆదేశాలు, స్వేచ్ఛ ఇవ్వడంతో ఆందోళనకారులను సైన్యం ఎలా అదుపుచస్తుందోననే చర్చ సాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com