Suicide Attack in India : ఆత్మాహుతి దాడి.. ఆమే టార్గెట్..

Suicide Attack in India : ఆత్మాహుతి దాడి.. ఆమే టార్గెట్..
Suicide Attack in India : భారత్‌తో ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నిన ఐసిస్ టెర్రరిస్టును రష్యా పోలీసులు పట్టుకున్నారు.

Suicide Attack in India : భారత్‌తో ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నిన ఐసిస్ టెర్రరిస్టును రష్యా పోలీసులు పట్టుకున్నారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత రాజకీయ నేతను ఆత్మాహుతి దాడి ద్వారా చంపేందుకు సిద్ధమైనట్లు ఆ ఉగ్రవాది రష్యా పోలీసులకు చెప్పాడు. ఉగ్రవాది చెప్పిన విషయాలను వీడియో ద్వారా రిలీజ్ చేసింది రష్యా నిఘా సంస్థ 'ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్' (ఎఫ్ఎస్‌బీ).

ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఓ టాప్ నేతను ఈ ఉగ్రవాది ఎప్రిల్ జూన్ నెల మద్యలో కలిసాడు. అతని దగ్గర నుంచి ఆత్మాహుతి దాడికి సంబంధించి పూర్తి ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇస్తాంబుల్‌లో ట్రైనింగ్ తరువాత అక్కడి నుంచి రష్యా వెళ్లి అటు నుంచి భారత్‌లో ఎంటర్ అయ్యేందుకు ఈ ఉగ్రవాదికి ఆదేశాలు అందాయి. రష్యాలోకి ఎంటర్ కాగానే ఎఫ్ఎస్‌బీ పోలీసులు పట్టుకున్నారు. అయితే నుపుర్ శర్మ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నుపుర్ శర్మను హతమార్చేందుకే ఈ టెర్రరిస్ట్ బయలుదేరినట్లు అంగీకరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story