Afghanistan: ప్లేటు మార్చిన తాలిబన్లు.. క్షమించమంటూ వేడుకోలు..

Afghanistan: ప్లేటు మార్చిన తాలిబన్లు.. క్షమించమంటూ వేడుకోలు..
Afghanistan: ఈ తరుణంలో తాలిబన్ ప్రభుత్వం దిగొచ్చింది. పొరుగుదేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపాలని నిశ్చయించుకుంది..

Afghanistan: మేము చెప్పిందే వేదం.. మేము చేసిందే చట్టం.. అంటూ వచ్చీ రాగానే ఓ భీభత్స భయానక వాతావరణాన్ని సృష్టించారు. అడుగడుగునా ఆంక్షలు విధించారు. తాలిబన్లు శాసిస్తారు.. ఆఫ్గన్లు పాటిస్తారు అదే నిజం.. అని ప్రపంచానికి వాళ్ల పవర్ ఏంటో చెప్పకనే చెప్పారు.. ఇప్పుడేంటో సడెన్‌గా ప్లేటు మార్చారు.

అందుకు కారణం లేకపోలేదు.. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది.. అంతటా ఆకలి కేకలు.. ఈ తరుణంలో తాలిబన్ ప్రభుత్వం దిగొచ్చింది. పొరుగుదేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపాలని నిశ్చయించుకుంది.. అగ్రరాజ్యం అమెరికా విధించిన ఆంక్షల నుంచి విముక్తి కలిగించాలని విజ్ఞప్తి చేసింది.

తాజాగా అఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టాఖి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అధికారంలోకి వచ్చాక కొన్ని నెలలపాటు తమ ప్రభుత్వం తప్పులు చేసిందని అంగీకరించారు. వాటిని పునారావృతం కాకుండా చూసుకుంటామని అంటున్నారు.

ప్రస్తుతం సంస్కరణల గురించి, సంక్షోభం నుంచి గట్టెక్కడం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. శాంతి భద్రతల స్థాపనకు, మానవ హక్కుల పరిరక్షణ ప్రకటనకు కట్టుబడి ఉంటాం. ముందు ముందు కూడా అదే ఆచరిస్తాం.

అందుకు అప్గన్‌ను ఆదుకోవాల్సిన బాధ్యత అమెరికా లాంటి అగ్రరాజ్యంపై ఉందని ఆయన పేర్కొన్నారు.గత ప్రభుత్వ ప్రతినిధులు నిధులతో పారిపోయారు. పైగా అఫ్గన్‌కు చెందిన బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను నిలిపివేశారు.

అఫ్గన్‌కు సంబంధించి 10 బిలియన్ డాలర్ల ఫండ్ నిలిచిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది విడుదలయ్యేందుకు అన్ని దేశాలు మాకు సహకరిస్తాయని ముట్టాఖీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story