- Home
- /
- అంతర్జాతీయం
- /
- Tasting TV: ఇదేదో బాగుందే.. ఆ టీవీ...
Tasting TV: ఇదేదో బాగుందే.. ఆ టీవీ చూస్తే నోరూరుతుంది.. నాకితే టేస్ట్ తెలుస్తుంది..

Tasting TV: మామూలుగా టీవీల్లో ఏదైనా వంట ప్రోగ్రామ్ వస్తుంటే.. అందులో చూపించే ఐటెమ్స్‌కు నోరూరిపోతుంది కదా.. కానీ ఆ ఆహార పదార్థాలన్నీ మనం ట్రై చేస్తే అదే టేస్ట్ వస్తుందా రాదా అన్న అనుమానం కూడా ఉంటుంది. ఒకవేళ మనం అది ట్రై చేసి ఫెయిల్ అయితే.. ఇంకొకసారి ట్రై చేయాలన్న ఆలోచన కూడా రాదు. అందుకే జపాన్ శాస్త్రవేత్తలు నాకితే టేస్ట్ తెలిసే టీవీని కనుక్కున్నారు.
జపాన్‌లోని మెయిజీ యూనివర్సిటీకి చెందిన హోమయి మియాషితా అనే శాస్త్రవేత్త ఈ వెరైటీ టీవీని కనుగొన్నారు. దీని పేరు 'టీటీటీవి'. అంటే టేస్ట్ ది టీవీ. ఈ టీవీ స్క్రీన్ రకరకాల ఫ్లేవర్స్‌ను టేస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. పైగా ఇది చాలా హైజీనిక్ అని మియాషితా అంటున్నారు.
ఈ టీవీలో మ్యూజిక్ డౌన్‌లోడ్ చేసినట్టుగా టేస్ట్‌లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మియాషితా అంటున్నారు. ప్రస్తుతం ఈ టీవీ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. త్వరలోనే ఇది ఇండియాతో పాటు ఇతర ప్రపంచ దేశాలకు కూడా అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు. అయితే దీని ధర 875 డాలర్లుగా నిర్ణయించారట. అంటే దాదాపుగా రూ. 65,500
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com