Nigeria: నైజీరియాలోని చర్చిలో ఉగ్రవాదుల మారణహోమం.. కాల్పుల్లో 50 మంది మృతి..

X
Nigeria: నైజీరియాలోని ఓ చర్చ్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. కాల్పులు, బాంబు పేలుళ్లతో తెగబడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ దారుణం జరిగింది. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనల కోసం వచ్చారు. దీంతో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కాల్పుల తరువాత చర్చి ప్రధాన పాస్టర్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో ఈ ప్రార్థనా స్థలం భయానకంగా మారింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
