Kailia Posey: మీమ్స్ ద్వారా ఫేమస్ అయిన పాప.. 16 ఏళ్ల వయసులో సూసైడ్..

Kailia Posey: ఇన్‌స్టాగ్రామ్ అనేది ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో ముఖ్యమైనదిగా మారిపోయిన తర్వాత.. మీమ్స్ అనేవి మనకు ఎక్కువశాతం ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తున్నాయి. అయితే ఆ మీమ్స్ వల్ల ముక్కు, మొహం తెలియని వారు కూడా నెటిజన్లకు దగ్గరయిపోతున్నారు. అలా దగ్గరయిన ఓ పాప.. కైలియా పోసీ. ఇప్పుడు తనకు 16 ఏళ్లు. ఎంతోమందికి ఎంటర్‌టైన్మెంట్ అందించిన కైలియా పోసీ ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కైలియా చిన్నప్పుడే ఎంటర్‌టైన్మెంట్ రంగంలో అడుగుపెట్టింది. 'టాడ్లర్స్ అండ్ టియారాస్' అనే కార్యక్రమంలో పాల్గొంది. అయితే ఆ కార్యక్రమంలోని ఒక ఎపిసోడ్‌లో కైలియా నవ్విన వీడియో ఒకటి చాలా ఫేమస్ అయ్యింది. ఇది ఇప్పటికే జిఫ్స్ రూపంలో సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది. అంతే కాకుండా కైలియా పలు బ్యూటీ కాంటెస్ట్‌లలో కూడా పాల్గొంది. కైలియా ఆత్మహత్య చేసుకొని మరణించిందని తన తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఈ విషయం బయటికొచ్చింది.
మీమ్స్ ద్వారా, జిఫ్స్ ద్వారా ఫేమస్ అయిన కైలియాకు ఇప్పుడు 16 ఏళ్లు. వారం క్రితం వరకు అంతా మామూలుగానే ఉన్నా.. కైలియా ఉన్నట్టుండి ఆత్మహత్య ఎందుకు చేసుకుందో ఎవరికీ అర్థం కావడం లేదు. తనకు మంచి భవిష్యత్తు ఉన్నా కూడా ఒక్క క్షణంలో ఆలోచించకుండా తను ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ కైలియా ఆత్మహత్య గురించి చెప్తూ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com