Samoa Island: భార్య పుట్టినరోజు మర్చిపోయారా..? అయితే ఇక జైలుకే..

Samoa Island: ఏ దేశంలో అయినా చట్టాలు అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కానీ కొన్ని దేశాల్లో మాత్రం కొన్ని చట్టాలు గురించి వింటుంటే కాస్త వింతగా అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న తప్పులకు పెద్ద పెద్ద శిక్షలు వేసే చట్టాలు అందులో ఒకటి. భార్య పుట్టినరోజును మర్చిపోవడం కూడా ఇలాంటి చిన్న తప్పుల్లో ఒకటి. అవును.. భార్య పుట్టినరోజు మర్చిపోతే జైలు శిక్ష వేసే దేశం ఒకటి ఉంది.
మహిళా సాధికారత కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి. అలాంటి చట్టాల్లో ఒకటే.. భార్య పుట్టినరోజు మర్చిపోతే భర్తను జైలుకు పంపడం. మామూలుగా భర్తలు భార్యల పుట్టినరోజును, పెళ్లిరోజును మర్చిపోవడం సహజమే. అలా మర్చిపోయిన సమయాల్లో ఏవో కారణాలు చెప్పి తప్పించుకోవడం కూడా సహజమే. కానీ సమోవా ద్వీపంలో అలా మర్చిపోతే పెద్ద క్రైమ్‌తో సమానం.
సమోవా ద్వీపంలో భర్త.. భార్య పుట్టినరోజును ఒక్కసారి మర్చిపోతే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. ఒకవేళ అదే తప్పు రెండోసారి చేస్తే భార్య ఫిర్యాదుతో అతడిని జైలుకు పంపిస్తారు. ఈ చట్టాన్ని ఇండియాలోకి కూడా తీసుకొస్తే బాగుండు అని కొందరు భార్యలు అనుకోవడంలో ఆశ్చర్యమే లేదు. పుట్టినరోజు అనేది చాలా స్పెషల్ అని, అలాంటి రోజును మర్చిపోతే ఇలాగే జరగాలని మరికొందరు భావం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com