Donald Trump : వైట్ హౌస్ నుంచి కీలక పత్రాలను ట్రంప్ దొంగిలించారా..?

Donald Trump : వైట్ హౌస్ నుంచి కీలక పత్రాలను ట్రంప్ దొంగిలించారా..?
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరిన్ని చిక్కులు తప్పేట్టు లేవు.

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరిన్ని చిక్కులు తప్పేట్టు లేవు.. రహస్య పత్రాల తరలింపు వివాదంలో ఆయన మరింత కూరుకుపోతున్నారు.. శ్వేత సౌధం వీడే సమయంలో కొన్ని బాక్సుల్లో రహస్య పత్రాలను తరలించినట్లుగా ఆరోపణలొచ్చాయి.. 67 విశ్వసనీయ, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలను ఇతర కాగితాలతో కలిపి ఉంచినట్లుగా ఇటీవలే ఎఫ్‌బీఐ తేల్చింది.. జూన్‌లో ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించిన సమయంలో ఉద్దేశపూర్వకంగానే పత్రాలను దాచి ఉండొచ్చని దర్యప్తు బృందం కోర్టుకు నివేదిక ఇచ్చింది.

తనిఖీ ఏజెంట్లను మార్‌ ఎ లాగో ఎస్టేట్‌లోని స్టోరేజ్‌రూమ్‌ వద్ద ఉద్దేశపూర్వకంగానే అడ్డుకొన్నారని పేర్కొంది. ఇతర రికార్డులను దాచిపెట్టడంగానీ, తొలగించడంగానీ చేసి ఉండొచ్చని తెలిపింది. దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించిన 54 పేజీల ఫైలింగ్‌ను విడుదల చేశారు. దీనిపై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

జనవరిలో ట్రంప్‌ మార్‌ ఎ లాగో ఎస్టేట్‌ నుంచి 15 పెట్టెల పత్రాలను నేషనల్‌ ఆర్కైవ్స్‌ స్వాధీనం చేసుకొంది. ఇవి ట్రంప్‌ పాలన చివరి రోజుల్లో ఆయన వద్దకు వచ్చినవి అయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. కొన్ని పత్రాలను ట్రంప్‌ చించేసినట్లు కూడా వారు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత నేషనల్‌ ఆర్కైవ్స్‌.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ జస్టిస్‌ను ఆశ్రయించడంతో దర్యాప్తు మొదలైంది.

గతంలో చాలా సార్లు ఎఫ్‌బీఐ అధికారులు అభ్యర్థించినా ట్రంప్‌ బృందం ఆ పత్రాలను ఇవ్వడానికి నిరాకరించింది.. జూన్‌లో ఒకసారి.. ఆగస్టులో మరోసారి ఎస్టేట్‌లో తనిఖీలు నిర్వహించగా.. నాటకీయ పరిణామాల మధ్య 20 పెట్టెల్లో పత్రాలను తరలించింది ఎఫ్‌బీఐ.. దర్యాప్తు బృందం తనిఖీలు చేపట్టిన గంటల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో రహస్య పత్రాలు బయటపడ్డాయని జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ జే బ్రాట్‌ ఫైలింగ్‌లో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే వ్యక్తి అన్ని రకాల పత్రాలు, ఈమెయిల్స్‌ను కచ్చితంగా నేషనల్‌ ఆర్కైవ్స్‌కు తరలించాల్సి ఉంటుంది.. కానీ, ఆ పత్రాలను ట్రంప్‌ తన ఎస్టేట్‌కు తరలించడం వివాదంగా మారింది.. అయితే, పత్రాలను ఆయన దుర్వినియోగం చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story