Elon Musk : అందుకే ట్విట్టర్‌ను ఇంకా కొనలేదు : ఎలాన్ మస్క్

Elon Musk : టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. ట్వీటర్ మధ్య వార్ తగ్గడం లేదు. డీల్ నుంచి ఎలాన్ మస్క్ తప్పుకుంటున్నట్లు ప్రకటించడంపై ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది. విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని కోర్టును కోరింది. అయితే ట్విట్టర్ వాదనలను ఎలాన్ మస్క్ తరుపు లాయర్ అభ్యంతరం తెలిపారు.
ఫేక్ అకౌంట్లను ట్విటర్ దాచిపెట్టిందని, అందుకే సత్వర విచారణను కోరుతోందని ఆరోపించారు. నకిలీ, స్పామ్ ఖాతాల సంఖ్యను గుర్తించడానికి టైమ్ పడుతుందని తెలిపారు. సాక్ష్యాధారాలు సమర్పించేందుకు గడువు అవసరమని, విచారణను 2023 వరకు వాయిదా వేయాలని మస్క్ న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు.
44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేస్తానంటూ ముందుకొచ్చిన ఎలాన్ మస్క్ ఇటీవల డీల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com