Trump Vs Musk : ఇక నువ్వు దేనికీ సీఈవో కాలేవు ట్రంప్ : ఎలాన్ మస్క్

Trump Vs Musk : ఇక నువ్వు దేనికీ సీఈవో కాలేవు ట్రంప్ : ఎలాన్ మస్క్
Trump vs Elon Musk : ట్వీట్లతో ట్రంప్‌కు బలమైన కౌంటర్ ఇస్తున్న ఎలాన్ మస్క్

Trump vs Elon Musk : డొనాల్డ్ ట్రంప్ అంటే మోనార్క్. ఆయన చెప్పిందే శాసనం. ఆయనకు ఆయనే తప్ప.. ఎవ్వరి మాట వినరు. ఎవ్వరినీ వదలకుండా అందరిపైనా మాటలయుద్ధానికి దిగుతారు. ఈసారి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను టార్గెట్ చేసారు.

ఎలాన్ మస్క్‌పై పలు విమర్శలు చేసిన ట్రంప్.. ట్విటర్‌ కొనుగోలు ఒప్పందంపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. దాంతో డొనాల్డ్ ట్రంప్‌కి అంతేధీటుగా ఎలాన్ మస్క్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ రాజకీయాలకు స్వస్తి పలికి శేష జీవితాన్ని హాయిగా గడపాలని ఎలాన్ మస్క్ ఎద్దేవా చేశారు.

బైడెన్ పదవీకాలం ముగిసేనాటికి ట్రంప్ వయసు 82 ఏళ్లు అవుతుందని మస్క్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అప్పుడు అమెరికా సహా దేనికైనా సీఈఓగా వ్యవహరించడానికి ట్రంప్ సరిపోరని దెబ్బిపొడిచారు. డెమోక్రటిక్‌ పార్టీ నేతలు కూడా ట్రంప్‌పై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు.

డొనాల్డ్ ట్రంప్‌పై తనకు ఎలాంటి ద్వేషం లేదంటూనే.. ఆయనపై ఉన్న ఆక్రోశాన్నంతా వెళ్లగక్కారు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌. ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మాటలయుద్ధం ఇటు అమెరికాలోను.. అటు సోషల్ మీడియాలోనూ కాక రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story