Amazon Rainforest: అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన చిన్నారులు.. నెల రోజుల తర్వాత..
Amazon Rainforest: ప్రపంచంలోని దట్టమైన అడవుల్లో అమెజాన్ కూడా ఒకటి. అలాంటి అడవుల్లో ఒకరోజు తప్పిపోతేనే బతకడం కష్టం. అలాంటిది నెలరోజులు అందులో తప్పిపోయి బ్రతకగలరా? అది కూడా ఇంకా సరిగ్గా ఊహ కూడా రాని ఇద్దరు చిన్నారులు తప్పిపోతే.. వారిని మళ్లీ ప్రాణాలతో చూడగలమా? అది ఒక అద్భుతమే కదా. అలాంటి ఓ అద్భుతమే తాజాగా జరిగింది.
అమెజాన్ అడవులకు దగ్గరగా జీవించే పాలమేర అనే వర్గం వారు పిట్టలను వేటాడుతూ జీవనం కొనసాగిస్తుంటారు. ఎన్నో తరాల నుండి ఈ కమ్యూనిటీ అంతా ఇదే వృత్తిలో స్థిరపడింది. ఇటీవల 8, 6 ఏళ్లు వయసు గల అన్నదమ్ములు ఇద్దరు ఇదే పనికోసం అమెజాన్ అడవుల్లోకి వెళ్లారు. కానీ వెనక్కి తిరిగి రాలేదు. దీంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు.
నెలరోజుల నుండి ఈ అన్నదమ్ముల కోసం పోలీసులు ఎంత గాలిస్తున్న వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ఆశలు వదిలేసుకున్నారు. కానీ స్థానికులు మాత్రం ఇంకా నమ్మకంతో వెతుకుతూనే ఉన్నారు. మంగళవారం చెట్లు నరకడానికి వచ్చిన ఓ వ్యక్తి కంటపడ్డారు ఈ అన్నదమ్ములు. దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చిన ఈ చిన్నారులను ఇంట్లో అప్పగించారు. అప్పుడు వీరి ఫోటోలు వైరల్ అయ్యాయి. నెలరోజులు సరైన ఆహారం లేకపోవడంతో ఈ చిన్నారులు పూర్తిగా నీరసంగా అయిపోయారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com