UAE: బాల్కనీలో బట్టలు ఆరేస్తే రూ.20 వేలు ఫైన్.. రూల్ వెనుక వింత కారణం..
UAE: కొన్ని దేశాలు పాటించే రూల్స్ చూస్తుంటే చాలా వింతగా అనిపిస్తుంటుంది. ఇలాంటి రూల్స్ కూడా ఉంటాయా అని ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఒక దేశంలో బాల్కనీలో బట్టలు ఆరేస్తే కూడా ఫైన్ వేస్తారట. బాల్కనీలో మాత్రమే కాదు.. బయటివారికి కనిపించేలా బట్టలు ఎక్కడా ఆరేయకూడదు అని రూల్ పెట్టిందట ఆ దేశ ప్రభుత్వం. అయితే ఈ రూల్ వెనుక ఓ కారణం కూడా ఉందని అక్కడి ప్రజలు అంటున్నారు.
బాల్కనీలో బట్టలు ఆరేస్తే ఫైన్ అనే వింత రూల్ యూఏఈలో అమలు అవుతోంది. అక్కడ అలా బట్టలు ఆరేసిన వారిపై 1,000 దిర్హామ్‌లు అంటూ రూ.20,000 ఫైన్ వేస్తారట. అలా బయట ఆరేయకుండా లాండ్రీ డ్రైయింగ్, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ లాంటి వాటితో బట్టలు ఆరబెట్టుకోవాలని అక్కడి ప్రభుత్వం సూచించిదట. అంతే కాకుండా దీనికి ఓ కారణం కూడా తెలిపిందట.
ప్రపంచంలోని టూరిస్ట్ ప్లేస్‌లలో యూఏఈ కూడా ఒకటి. ఏటా ఇక్కడికి ఎంతోమంది టూరిస్టులు వెళ్తుంటారు. అయితే అలా బాల్కనీల్లో, కనిపించేలా బట్టలు ఆరేయడం వల్ల నగర అందం దెబ్బతింటుందని ప్రభుత్వం భావిస్తుందట. అందుకే అలా చేయడం వల్ల ఫైన్ అనే రూల్‌ను ప్రవేశపెట్టిందట. ఇది మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో దేశాల్లో అమలవుతున్న ఎన్నో రూల్స్ కాస్త వింతగానే ఉంటాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com