Russia Ukraine War : క్రిమియా బ్రిడ్జిని పేల్చేసిన ఉక్రెయిన్ బలగాలు..

Russia Ukraine War : క్రిమియా బ్రిడ్జిని పేల్చేసిన ఉక్రెయిన్ బలగాలు..
Russia Ukraine War : రష్యా ఆక్రమణలో ఉన్న కీలకమైన క్రిమియా బ్రిడ్జిని ఉక్రెయిన్‌ బలగాలు పేల్చేశాయి

Russia Ukraine War : రష్యా ఆక్రమణలో ఉన్న కీలకమైన క్రిమియా బ్రిడ్జిని ఉక్రెయిన్‌ బలగాలు పేల్చేశాయి. ట్రక్కు బాంబులతో అ వంతెనను పేల్చేసినట్టు సమాచారం.. అయితే బ్రిడ్జిపై ట్యాంకర్‌ పేలడంతో కెర్చ్ వంతెన కూలినట్టు రష్యా ప్రభుత్వం చెబుతోంది. ఈ పేలుడుతో క్రిమియాతో రష్యాకు లింక్‌ తెగిపోయింది. బ్రిడ్జి పేల్చివేతపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌. పేలుడులో ఉక్రెయిన్‌ పాత్ర ఉన్నట్టు తేలితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అమెరికా సాయంతో ఉక్రెయిన్‌ బలగాలు ఈ వంతెనను పేల్చేసినట్టు రష్యా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఘటనా స్థలానికి డిటెక్టివ్‌లను పంపినట్లు దర్యాప్తు కమిటీ తెలిపింది.

ఉక్రెయిన్ పై రష్యా సైన్యం విధ్వంసానికి దిగింది. తన బలగంతో దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది.గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్‌ ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ సైన్యం ఎదురుదాడిని ఉద్ధృతం చేసింది. రష్యా ఆక్రమించిన అనేక ప్రాంతాలకు విముక్తి కలిగించింది. దొనెట్స్క్, జపోరిజియా, లుహాన్స్క్‌, ఖేర్సన్‌ ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించినా వాటిపై పూర్తి నియంత్రణను ఆ దేశం సాధించలేకపోతోంది. ముఖ్యంగా ఖేర్సన్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ దళాలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. పశ్చిమ దేశాలు సరఫరా చేస్తున్న ఆయుధాలతోనే ఉక్రెయిన్‌ సైన్యం పోరాడుతోంది.

అయితే ఉక్రెయిన్‌లో సైన్యానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ.. రష్యా మరో కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ క్షేత్రంలో దాడులకు నాయకత్వం వహించేందుకు కొత్త జనరల్‌ను నియమించింది. జనరల్‌ సెర్గీ సురోవికిన్‌ను ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ ప్రాంతాల్లో 'జాయింట్ గ్రూపింగ్ ఆఫ్ ఫోర్సెస్ కమాండర్‌'గా నియమించినట్లు రష్యా రక్షణశాఖ శనివారం ప్రకటించింది. సైబీరియాలోని నోవోసిబిర్స్క్‌లో జన్మించిన సురోవికిన్. తజికిస్థాన్, చెచెన్యాతోపాటు సిరియాలో పోరాట అనుభవం ఉంది. ఇప్పటివరకు ఉక్రెయిన్‌లోని దక్షిణ దళాలకు నాయకత్వం వహించారు.

ఇక పెద్ద దేశాల మధ్య పంతాల నడుమ ఉక్రెయిన్ బాగా నలిగిపోయింది. ఇప్పటికే నగరాలకు నగరాలు నాశనం అయిపోయాయి. కోట్లకు కోట్ల విలువ జేసే ఆస్తులు,భవనాలు బుగ్గిపాలయ్యాయి. శిధిలాల నడుమ ఉక్రెయిన్ గాయాల దిబ్బగా మారిపోయింది.దీన్నుంచి కోలుకుని పూర్వవైబవం తీసుకురావాలంటే ఉక్రెయిన్ ప్రభుత్వానికి చాలా ఏళ్లు పడుతుంది.ఉక్రెయిన్ వార్ సమయంలో అమెరికాతో కలిసి నాటో దేశాలన్నీ కూడా రష్యాపై ఆంక్షలు విధించాయి.

తనను ఇబ్బంది పెట్టిన దేశాలకు గట్టిగానే బదులివ్వాలని రష్యా పంతంగా ఉంది. అందుకే అణ్వాయుధాలను తెరపైకి తెచ్చి ఉంటుందని అంటున్నారు. అయితే కేవలం అందరినీ భయపెట్టడానికే రష్యా ప్రయత్నిస్తూ ఉండచ్చని నిజానికి రష్యా ఎలాంటి అణ్వాయుధాలను ప్రయోగించకపోవచ్చునని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story